ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో రగడ, ప్రతిపక్షాల ఆగ్రహం, ఆర్థిక మంత్రి ప్రసంగానికి అంతరాయం
ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో ప్రతిపక్షాలు రెండో రోజైన బుధవారం కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పించాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో..
ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో ప్రతిపక్షాలు రెండో రోజైన బుధవారం కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం కల్పించాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో..ద్రవ్య బిల్లుమీద చర్చకు సమాధానం ఇస్తున్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. వివాదాస్పదమైన ఈ బిల్లును అడ్డుకునేందుకు తమ ఎంపీలను ప్రత్యేకంగా ఢిల్లీకి హుటాహుటిన రప్పించినట్టు టీఎంసీ సభ్యులు తెలిపారు. ఈ బిల్లును లోక్ సభ ఇదివరకే ఆమోదించింది. ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు’ గా దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ బిల్లు… ఎన్నికైన ముఖ్యమంత్రి కన్నా నగర లెఫ్టినెంట్ గవర్నర్ కి విస్తృత అధికారాలను కల్పించడానికి ఉద్దేశించినది. దీన్నిమొదట సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని ఆప్ నేత సంజయ్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. మీరు ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయారని, అందుకే దీన్ని తెచ్చారని బీజేపీ సభ్యులను ఉద్దేశించి ఆరోపించారు. ’69 రాజ్యాంగ సవరణల అనంతరం ఢిల్లీ ప్రభుత్వం ఏర్పడింది.. ఈ బిల్లు అప్రజాస్వామికం, రెండు కోట్ల మంది ఢిల్లీ నగర వాసులు న్యాయం కావాలని కోరుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవలే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రభుత్వం కన్నా లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎక్కువ అధికారాలను కల్పిస్తే ఇక ముఖ్యమంత్రి, కేబినెట్, ఈ నగర ఓటర్లు ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు. దీన్ని వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీ పై పెత్తనానికే బీజేపీ ప్రభుత్వం దీన్ని తెచ్చిందని ఆరోపించారు. రాజ్యసభలో మొదట చర్చకు ప్రతిఒక్కరికీ అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆయన చైర్మన్ కు లేఖ కూడా రాశారు .
మరిన్ని ఇక్కడ చదవండి: వినియోగదారులకు షాక్ ఇచ్చిన వోడాఫోన్ ఐడియా.. ఆ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన టెలీకాం సంస్థ..
అర్నాబ్ ను అరెస్టు చేయదలిస్తే మూడు రోజుల ముందు నోటీసు ఇవ్వాలి, పోలీసులకు కోర్టు ఆదేశం