బహిరంగంగా ఇలా చేశారో.. ఇక మీకు రేషన్ కట్..!
స్వచ్ఛ్ భారత్.. ఇది ప్రధాని మోదీ దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చిన భృహత్తర కార్యక్రమం. పరిశుభ్రతను పాటిస్తూ.. గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే పలుచోట్ల ఈ కార్యక్రమాలకు విపరీతమైన ప్రకటనలు చేస్తున్నా.. ప్రజల్లో మాత్రం తగినంత మార్పు రావడంలేదు. అయితే ఒడిషాలోని ఓ గ్రామం.. వినూత్న ప్రయోగం చేసింది. దీంతో ఆ గ్రామంలో బహిరంగ మల విసర్జనను నియంత్రిస్తున్నారు. అయితే ఈ గ్రామస్థులు చేస్తున్న వినూత్న ప్రయోగం పలువివాదాలకు కూడా దారితీస్తోంది. వివరాల్లోకి […]

స్వచ్ఛ్ భారత్.. ఇది ప్రధాని మోదీ దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చిన భృహత్తర కార్యక్రమం. పరిశుభ్రతను పాటిస్తూ.. గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే పలుచోట్ల ఈ కార్యక్రమాలకు విపరీతమైన ప్రకటనలు చేస్తున్నా.. ప్రజల్లో మాత్రం తగినంత మార్పు రావడంలేదు. అయితే ఒడిషాలోని ఓ గ్రామం.. వినూత్న ప్రయోగం చేసింది. దీంతో ఆ గ్రామంలో బహిరంగ మల విసర్జనను నియంత్రిస్తున్నారు. అయితే ఈ గ్రామస్థులు చేస్తున్న వినూత్న ప్రయోగం పలువివాదాలకు కూడా దారితీస్తోంది. వివరాల్లోకి వెళితే..
ఒరిస్సాలోని గంజాం జిల్లా శనఖే ముండి బ్లాక్‌లోని గౌతమీ పంచాయతీ పరిధిలో బహిరంగ మల విసర్జనను నియంత్రించేందుకు ఓ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేసే కుటుంబాలకు రేషన్ సరుకులను నిలిపివేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఇలా చేసిన దాదాపు 20 కుటుంబాలకు రేషన్ కూడా ఇవ్వడం లేదని సర్పంచ్ సుశాంత్ స్వైన్ తెలిపారు.
స్వయం సహాయక సంఘాలకు చెందిన దాదాపు 300 మంది మహిళలు.. ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు గ్రామంలో పర్యవేక్షిస్తున్నారట. దీంతో బహిరంగ మలవిసర్జన అలవాటు తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు. కాగా, ఆహార భద్రత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అనీ ఆయా కుటుంబాలకు రేషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు గంజాం కలెక్టర్ తెలిపారు. అయితే ఇలాంటి నిర్ణయంతో గ్రామంలో స్వచ్ఛ్ భారత్ కలలు సాకారం అవుతాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.