AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీకి కేంద్రం షాక్..!! రాజధానిని ఎత్తేశారా..?

ఏపీకి రాజధాని లేదా..? నిజమా అంటే.. అవుననే అంటోంది కేంద్ర ప్రభుత్వం. కావాలని చేశారో.. తెలీక చేశారో కానీ.. ఏపీకి రాజధాని లేకుండా చేశారు. దీంతో.. ఏపీకి చెందిన నేతలు, ప్రజలు అవాక్కవుతున్నారు. ఇంతకీ కేంద్రం చేసిన ఆ పని ఏంటి..! ఇంకెందుకు ఆలస్యం.. మీరు తెలుసుకోండి. గత కొన్ని రోజులుగా.. ఏపీ రాజధానిపై.. ఆంధ్రప్రదేశ్‌లో రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. రాజధాని మా ప్రాంతంలో కావాలంటే.. మాకు కావాలని.. పలు జిల్లాలకు చెందిన వారు నిరసనలకు, […]

ఏపీకి కేంద్రం షాక్..!! రాజధానిని ఎత్తేశారా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 03, 2019 | 10:12 AM

Share

ఏపీకి రాజధాని లేదా..? నిజమా అంటే.. అవుననే అంటోంది కేంద్ర ప్రభుత్వం. కావాలని చేశారో.. తెలీక చేశారో కానీ.. ఏపీకి రాజధాని లేకుండా చేశారు. దీంతో.. ఏపీకి చెందిన నేతలు, ప్రజలు అవాక్కవుతున్నారు. ఇంతకీ కేంద్రం చేసిన ఆ పని ఏంటి..! ఇంకెందుకు ఆలస్యం.. మీరు తెలుసుకోండి.

గత కొన్ని రోజులుగా.. ఏపీ రాజధానిపై.. ఆంధ్రప్రదేశ్‌లో రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. రాజధాని మా ప్రాంతంలో కావాలంటే.. మాకు కావాలని.. పలు జిల్లాలకు చెందిన వారు నిరసనలకు, గొడవలకు దిగుతోన్నారు. అందులోనూ.. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఏపీ రాజధాని.. అమరావతినే అని ఫిక్స్‌ అయి.. అక్కడ.. రైతుల నుంచి భూములను కూడా తీసుకుని.. పెద్ద ఎత్తున నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు.

అనంతరం.. 2019 ఎన్నికల్లో.. వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వైసీపీ వచ్చాక.. రాజధానిపై పెద్ద దుమారమే లేచింది. కాసేపు ప్రకాశం జిల్లాలోని దొనకొండ అని.. మరోవైపు కర్నూలు అని పలు ప్రాంతాలు చర్చలకు వచ్చాయి. అయితే.. రాష్ట్రంలో ఇంత జరుగుతోన్నా.. ఏపీ రాజధాని అంశంపై కానీ.. దాని గురించి ప్రస్తావన కానీ.. చేయలేదు సీఎం జగన్.

అయితే.. కేంద్రం ప్రభుత్వం కూడా.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు అనుకుందో ఏమో.. కానీ.. తాజాగా.. విడుదల చేసిన పొలిటికల్ మ్యాప్‌లో.. ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు లేదు. జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మోడీ సర్కార్ భారత దేశ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో 28 రాష్ట్రాలతో పాటు 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే.. కేంద్రం విడుదల చేసిన ఈ మ్యాప్‌లో.. అన్ని రాష్ట్రాలకూ.. రాజధానులను తెలిపింది.. కానీ ఒక్క ఏపీకి తప్ప. ఏపీ రాజధాని.. మ్యాప్‌లో లేకపోవడం.. ఇటు నేతలకు అటు ప్రజలకు ఆశ్చర్యం కల్గిస్తోంది. అమరావతి అని పేర్కొన్నా పెద్ద రచ్చ లేకపోయేది కానీ.. ఇప్పుడు మొత్తానికి ఏపీకి రాజధానిని ఎత్తేయడంతో.. ఇప్పుడు ఫుల్లుగా.. రచ్చ షురూ అయ్యింది.

Follow Us
ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. ఇది కదా అసలైన ట్విస్ట్..!
ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. ఇది కదా అసలైన ట్విస్ట్..!
పని చేయని బుద్ధి ఇనుములా తుప్పు పడుతుంది..మోనాలిసా సృష్టికర్త
పని చేయని బుద్ధి ఇనుములా తుప్పు పడుతుంది..మోనాలిసా సృష్టికర్త
10 కోట్లతో తీస్తే 1000 కోట్ల కలెక్షన్లు.. అంతలా ఏముందీ సినిమాలో..
10 కోట్లతో తీస్తే 1000 కోట్ల కలెక్షన్లు.. అంతలా ఏముందీ సినిమాలో..
Video: నా టార్గెట్ 200: వైభవ్ సూర్యవంశీ
Video: నా టార్గెట్ 200: వైభవ్ సూర్యవంశీ
ఈ తేదీల్లో పుట్టారా? అయితే డబ్బు, విలాస జీవితం మీ వెంటే!
ఈ తేదీల్లో పుట్టారా? అయితే డబ్బు, విలాస జీవితం మీ వెంటే!
బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని..
బంగారం చోరీ చేసిందన్న ఫ్లాట్ ఓనర్.. మహిళా వాచ్‌మెన్ ఊహించని..
జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసా..?
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
సూపర్ సిబిల్ స్కోరుతో వద్దన్నా బ్యాంకుల్లో ప్రీమియర్ బెనిఫిట్స్
‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!
‘వాళ్లంతా తోపులేమో’.. ఒక్క మాటతో ఇచ్చిపడేసిన సూర్యకుమార్ యాదవ్..!
కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు,యువతలో పెరిగిన నడుము కీలు మార్పిడి
కోవిడ్ తెచ్చిన సరికొత్త ముప్పు,యువతలో పెరిగిన నడుము కీలు మార్పిడి