Oxygen cylinders explode : అంబులెన్స్ లో ఒక్కసారిగా పేలిన ఆక్సిజన్ సిలిండర్లు.. ఎగసిపడుతున్న మంటలు
Oxygen cylinders explode : తమిళనాడు కోయంబత్తూర్ ప్రభుత్వాస్పత్రి లోని అంబులెన్సు లలో ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి..
Oxygen cylinders explode : తమిళనాడు కోయంబత్తూర్ ప్రభుత్వాస్పత్రి లోని అంబులెన్సు లలో ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో భారీగా పొగలు, మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో పార్క్ చేసిన అంబులెన్స్ లో ఈ పేలుడు సంభవించింది. కాగా, ఆక్సిజన్ సిలండర్లు ఎలా పేలాయన్నదానిపై ఆస్పత్రి వర్గాలు విచారణ ప్రారంభించాయి. అయితే, ఆస్పత్రికి ఎలాంటి ముప్పులేదని.. రోగులు కలత చెందవద్దని, ప్రమాదం ఉండదని ఆస్పత్రి సూపరింటెండెంట్ ధైర్యం చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
Oxygen cylinders explode in ambulances at Coimbatore Government Hospital. Patients, hospital staff rushed in with fear of massive blazing fires #COVIDEmergency #CovidHelp pic.twitter.com/bHwn4fLQrt
— DONTHU RAMESH (@DonthuRamesh) May 22, 2021