Watch Video: మిస్టరీగా వరుస ప్రమాదాలు.. ఒకే టోల్‌ప్లాజా వద్ద సీరియల్ యాక్సిడెంట్స్.. తాజా 12 వాహనాలను ఢీకొట్టిన మరో ట్రక్కు..

Road Accident: ప్రతిసారి అదే టోల్‌ప్లాజా వద్ద ట్రక్కు ప్రమాదాలు.. కంట్రోల్ తప్పుతున్న డ్రైవర్లు.. అసలు ఏం జరుగుతోంది.. డ్రామెటిగ్‌గా జరిగిన ఈ ప్రమాదంలో భారీగా వాహనాలు ధ్వంసమయ్యాయి. నవి ముంబైలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరుగుతుండగానే డ్రైవర్ దూకేశాడు.

Watch Video: మిస్టరీగా వరుస ప్రమాదాలు.. ఒకే టోల్‌ప్లాజా వద్ద సీరియల్ యాక్సిడెంట్స్.. తాజా 12 వాహనాలను ఢీకొట్టిన మరో ట్రక్కు..
Road Accident
Follow us

|

Updated on: Sep 26, 2022 | 7:07 PM

Road Accident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. డ్రామెటిగ్‌గా జరిగిన ఈ ప్రమాదంలో భారీగా వాహనాలు ధ్వంసమయ్యాయి. నవీ ముంబైలోని వాషి టోల్ ప్లాజా వద్ద నెమ్మదిగా వచ్చిన ఓ ట్రక్కు 12 కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ క్రమంలో టోల్‌ క్యూలో ఉన్న కారు, టెంపోను చాలా నమ్మదిగా ఢీ కొట్టడం.. అందులోనూ ఆ ట్రక్కు ఒక్కో ట్రక్కును ఢీ కొట్టడం చూస్తే మీరు కూడా షాక్ తింటారు. ఈ ప్రమాదం పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లుగా అనిపిస్తుంది. ముందున్న వాహనాలను టార్గెట్ చేసుకుని ఢీ కొడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది.

నవీ ముంబైకి చెందిన వాషి టోల్ బూత్ ప్రవేశద్వారం వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన థ్రిల్లింగ్ సీసీటీవీ ( CCTV ) ఫుటేజీ బయటకు వచ్చింది. టోల్ కోసం నిలబడిన వాహనాల క్యూలోకి డంపర్ దూసుకెళ్లింది. ఈ డంపర్‌ ఢీకొనడంతో 12 వాహనాలు దెబ్బ తిన్నాయి. దీంతో పలు వాహనాలు తుక్కు తుక్కయ్యాయి. ఈ ప్రమాదం తర్వాత వాషి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

డంపర్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ షాకింగ్ దృశ్యాలు అక్కడికి సమీపంలో ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని మహానగర పాలిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

వీడియో చూడండి…

ప్రమాదం జరిగిన తర్వాత డంపర్ డ్రైవర్ పరారయ్యాడు. అయితే అతడికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం జరుగుతున్న సమయంలోనే వాహనంపై నుంచి ట్రక్కు డ్రైవర్ దూకి ఉంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రక్కులోని డ్రైవర్ సైడ్ డోర్ తెరిచి ఉండటం మనం సీసీటీవీలో చూడవచ్చు.

ఆర్టీసీ బస్సులు, టెంపోలు, కార్లు, కొన్ని ద్విచక్ర వాహనాలు ట్రక్కు ఢీ కొనడంతో నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రిలో తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో చాలా మంది తృటిలో తప్పించుకున్నారు. అయితే వారి వాహనాలు మాత్రం దెబ్బతిన్నాయి.

సియోన్-పన్వెల్ హైవేపై డంపర్ ప్రమాదాలు కొత్త విషయం కాదు. ఇటీవల జూయినగర్‌లోనూ ట్రక్కు అచ్చం ఇలానే ఢీ కొట్టింది. ముందున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటన గత వారం రోజుల క్రితమే జరిగింది. తాజా జరిగిన ఈ ప్రమాదం అందరిని ఆలోచింప చేస్తోంది. ప్రతిసారి ఇదే టోల్ ప్లాజా వద్ద ట్రక్కులు ఢీ కొనడం డ్రైవర్లను ప్రశ్నలకు గురి చేస్తోంది.

ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంతో పన్వేల్ వైపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌ రద్దీ కారణంగా వాశి వంతెన వరకు వాహనాలు బారులు తీరాయి. ఈ మార్గంలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు పోలీసులు కూడా శ్రమించాల్సి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!