‘దేశంలో మరిన్ని కరోనా వైరస్ వ్యాక్సిన్లు వస్తున్నాయ్’, కేంద్ర మంత్రి హర్షవర్ధన్
దేశంలో త్వరలో ఆరుకుపైగా కరోనా వైరస్ వ్యాక్సిన్లు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఇండియాలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకామందులను అభివృద్ధి చేయగలిగామని,
దేశంలో త్వరలో ఆరుకుపైగా కరోనా వైరస్ వ్యాక్సిన్లు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. ఇండియాలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకామందులను అభివృద్ధి చేయగలిగామని, వాటిని 71 దేశాలకు అందజేశామని ఆయన చెప్పారు. మరిన్ని దేశాలు కూడా వీటిని కోరుతున్నాయని చెప్పిన ఆయన.. ఆయా దేశాల అభ్యర్థనలను పురస్కరించుకుని వీటిని పంపుతున్నట్టు చెప్పారు. శనివారం వరకు ప్రజలకు 1.84 కోట్ల డోసులను ఇచ్చామని, నిన్న 20 లక్షల మంది వ్యాక్సిన్లు తీసుకున్నారని ఆయన తెలిపారు. శాస్త్ర రంగాన్ని గౌరవించాలని, ఈ టీకామందులపై రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలని ఆయన కోరారు. ఇది శాస్త్రీయంగా చేస్తున్న పోరాటం.. అందుకే అంతా కలిసి పని చేయాలి అని హర్షవర్ధన్ పేర్కొన్నారు.మన దేశ రీసెర్చర్లు, శాస్త్రజ్ఞుల ప్రయత్నాలు అమూల్యమైనవని, వారి శ్రమ శక్తి కారణంగానే ఈ వ్యాక్సిన్లను సాధించగలిగామని ఆయన చెప్పారు.
2020 సంవత్సరాన్ని కోవిడ్ -19 సంవత్సరంగానే కాకుండా సైన్స్, శాస్త్రజ్ఞుల సంవత్సరంగా కూడా పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియాలో మొదట కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ఒకటే ఉండేదని, కానీ ఇప్పుడు 2,412 ల్యాబ్ లు ఉన్నాయని హర్షవర్ధన్ వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడాన్ని ఆయన ప్రస్తావిస్తూప్రజల నిర్లక్ష్యం, అపోహల కారణమే ఇదని వివరించారు. వ్యాక్సిన్లు వచ్ఛేశాయని, ఇక మనం నిర్భయంగా ఉండవచ్చునని భావిస్తున్నారని, కానీ కోవిడ్ నిబంధనలు, ప్రొటొకాల్స్ పాటించకపోతే ఈ విధమైన పరిస్థితే ఏర్పడుతుందని హర్షవర్ధన్ అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వ మార్దర్శకాలను పాటించకపోతే మళ్ళీ ఇదివరకటి లాగే ఉంటుందని ఆయన అన్నారు . ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడాన్ని ఆయన గుర్తు చేశారు. మళ్ళీ టెస్టింగులు పెరగాల్సి ఉందన్నారు. మాస్క్ ధారణ తప్పనిసరి అని, సామూహిక సమావేశాలను తగ్గించుకోవలసి ఉందని, అలాగే పెళ్లిళ్లు వంటి శుభ కార్యక్రమాలకు గతంలో మాదిరి గెస్టుల సంఖ్యను కుదించాలని హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. ఉదాహరణకు కర్ణాటకలో ఓ ‘పోలీసు వివాహానికి’ సుమారు 200 మంది గెస్టులు వచ్చినట్టు తెలిసిందన్నారు .
మరిన్ని చదవండి ఇక్కడ :
Love Proposal: ఆమె మోకరిల్లింది.. అతను దాసోహమయ్యాడు.. కొన్ని తియ్యనైన కన్నీళ్లు.. వీడియో
KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై గళమెత్తిన కేటీఆర్, ఏపీ.. దేశంలో భాగం కాదా..! అని వ్యాఖ్య ( వీడియో )