Video: ప్లాన్ చేసి దాడి చేశాం..! పాక్‌లో సైనిక స్థావరాన్ని కుప్పకూల్చిన ఇండియన్ ఆర్మీ
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. తర్వాత, ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వాణిజ్యం, సింధు జల ఒప్పందం నిలిచిపోయాయి.

‘ఆపరేషన్ సిందూర్’ను న్యాయం అందించడానికి ప్లాన్ చేసి, ట్రైనింగ్ పొంది, న్యాయం చేసినట్లు భారత సైన్యపు వెస్ట్రన్ కమాండ్ ఆదివారం (మే 18) తెలిపింది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయంపై ఒక వీడియో కూడా రిలీజ్‌చేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత-కశ్మీర్ (PoK) లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి ఇండియా మే 7 (బుధవారం)న ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. ఆ తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అనంతరం మే 10న ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
“కానీ ఇదంతా పహల్గామ్ దాడితో ప్రారంభమైంది. ఆ దేశంపై కోపం లేదు, కానీ అమాయక హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక ఉంది. పాకిస్తాన్‌కు దాని భవిష్యత్ తరాలు మరచిపోలేని పాఠం నేర్పించారు. మన స్థావరాలపై కాల్పులు జరిపిన పాకిస్తాన్ పికెట్లను నాశనం చేశారు. ఇది ప్రతీకారం కాదు, న్యాయం కోసం చేసింది. శత్రు సైనికులు తమ స్థావరాలను విడిచిపెట్టి ప్రాణాల కోసం పారిపోయారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనేది పాకిస్తాన్ దశాబ్దాలుగా నేర్చుకోని పాఠం” అని సరిహద్దులోని పాకిస్తాన్ పికెట్లను లక్ష్యంగా చేసుకున్న వీడియోలను సమర్ధించే కథనం పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తీసుకున్న చర్యల క్లిప్‌లను కూడా వీడియో చూపించింది. శత్రు భూభాగంపై భారీ షెల్లింగ్‌లతో దాడి చేసినట్లు అందులో చూడొచ్చు.
ఇదిలావుండగా భారత్, పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) సమావేశం ఆదివారం జరగలేదని భారత సైన్యం ఆదివారం తెలిపింది, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోందని కూడా తెలిపింది. మే 12న జరిగిన DGMOల పరస్పర చర్యలో నిర్ణయించినట్లుగా, కాల్పుల విరామం కొనసాగింపు విషయానికొస్తే దానికి గడువు తేదీ లేదు అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల DGMOలు మే 12న రెండు అణు పొరుగు దేశాల మధ్య శత్రుత్వాలను ముగించి కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయించారు. రెండు దేశాలు అంగీకరించిన కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌తో వాణిజ్యం, సింధు జల ఒప్పందం నిలిచిపోయినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Planned, trained & executed.
Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon
— Western Command – Indian Army (@westerncomd_IA) May 18, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




