తబ్లీఘీ ఈవెంట్ తో వెయ్యికి పైగా కరోనా కేసులు లింక్

17 రాష్ట్రాలు.. 1,023 కరోనా పాజిటివ్ కేసులు.. వీటికి మూలం ఢిల్లీలో జరిగిన తబ్లీఘీ ఈవెంటేనని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో మొత్తం కరోనా కేసుల్లో సుమారు 30 శాతం ఈ పర్టిక్యులర్ ప్లేస్....

తబ్లీఘీ ఈవెంట్ తో వెయ్యికి పైగా కరోనా కేసులు లింక్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 05, 2020 | 3:26 PM

17 రాష్ట్రాలు.. 1,023 కరోనా పాజిటివ్ కేసులు.. వీటికి మూలం ఢిల్లీలో జరిగిన తబ్లీఘీ ఈవెంటేనని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో మొత్తం కరోనా కేసుల్లో సుమారు 30 శాతం ఈ పర్టిక్యులర్ ప్లేస్ (నిజాముద్దీన్ మసీదు) తో లింక్ కలిగి ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు దాదాపు 3 వేల కరోనా కేసులు నమోదయ్యాయని, శుక్రవారం నుంచి 601 కేసులు పెరిగాయని ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్ గడ్, బీహార్  .. ఇలా మొత్తం 17 రాష్ట్రాలకు, ఈ మత పరమైన కార్యక్రమానికి సంబంధం ఉందని ఆయన చెప్పారు. మార్చి 10-13 తేదీల మధ్య ఢిల్లీ నిజాముద్దీన్ మసీదులో జరిగిన ప్రార్థనా సమావేశాలకు దేశ విదేశాల నుంచి సుమారు రెండు వేలమందికి పైగా హాజరయ్యారు. నిజానికి గతంలో కూడా మలేసియాలోనూ తబ్లీఘీ జమాత్ సమావేశాలు జరిగాయి. అప్పటికే ఆ సభలకు హాజరైన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. దాంతో మలేసియా ప్రభుత్వం ఆ సమావేశాలను రద్దు చేసింది. ఇస్లామిక్ మత ప్రబోధాలను ప్రవచించే అనేకమంది బోధకులు తాజాగా ఢిల్లీ నిజాముద్దీన్ మసీదులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. గత జనవరి నుంచే కరోనా ప్రమాద ఘంటికలు మెల్లగా మొదలైనప్పటికీ.. కేంద్రం గానీ, ఢిల్లీ ప్రభుత్వం గానీ ఈ మతపర కార్యక్రమాన్ని పట్టించుకోలేదు. ఆ కార్యక్రమాలకు ఏ ఇతర దేశాలనుంచి ఎంతమంది హాజరయ్యారన్న లెక్కలు గానీ, దేశీయంగా ఎంతమంది మతగురువులు వచ్చారన్న వివరాలు గానీ అధికారుల వద్ద లేవు. అప్పటికే వారిలో అనేకమందికి కరోనా  పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. ఈ వైరస్ ప్రాణాంతకమైందని, వ్యక్తుల నుంచి వ్యక్తులకు సులువుగా సోకుతుందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి విదేశీ సంస్థలు ప్రకటించేంతవరకు మనకు దీనిపై స్పష్టత లేకుండా పోయింది. తీరా పరిస్థితి అవగాహనలోకి  వచ్ఛే లోగానే ఆ నిజాముద్దీన్ సభలకు హాజరైనవారు  వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా కరోనా కేసుల సంఖ్య కేంద్ర బిందువు నిజాముద్దీనే అని తెలిసేసరికి ప్రభుత్వం దీనిపై అలర్ట్ అయింది. ఆయా వ్యక్తులను గుర్తించే పనిలో పడింది.