పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. వీరమరణం పొందిన జవాన్

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. వీరమరణం పొందిన జవాన్

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కంరాజీపొరా ప్రాంతంలో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 12, 2020 | 11:36 AM

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కంరాజీపొరా ప్రాంతంలో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్‌ వీరమరణం పొందారు. మరో జవాన్ గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే గాయపడ్డ జవాన్‌ను స్థానిక ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. కంరాజీపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ కట్టుదిట్టంగా చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. మిగతా ఉగ్రవాదుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.

Jammu and Kashmir: One soldier lost his life in action and one terrorist has been neutralised in the ongoing Pulwama encounter. Search operation underway. (Visuals deferred by unspecified time) pic.twitter.com/ClBipyAqVb

— ANI (@ANI) August 12, 2020

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu