హిజ్బుల్‌‌కు చావుదెబ్బ.. శభాష్ ఇండియన్ ఆర్మీ..!

జమ్ముకశ్మీర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ.. ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. హిజ్బుల్ ముజాహిద్దిన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్‌ను హతమార్చింది. రాంబన్‌ జిల్లా భద్రతాబలగాలు శనివారం చేపట్టిన భారీ ఆపరేషన్‌లో హిజ్బుల్ టాప్ కమాండర్‌ ఒసామాతోపాటు మరో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టంది. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లో సైన్యం చేపట్టిన తొలి భారీ ఆపరేషన్‌ ఇదే. ఈ ఎన్‌కౌంటర్ దాదాపు తొమ్మిది గంటలకుపైగా కొనసాగింది. అంతేకాదు ఈ ఘటనలో ఒక కుటుంబాన్ని […]

హిజ్బుల్‌‌కు చావుదెబ్బ.. శభాష్ ఇండియన్ ఆర్మీ..!
Follow us
Pardhasaradhi Peri

| Edited By:

Updated on: Sep 29, 2019 | 1:09 PM

జమ్ముకశ్మీర్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ.. ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. హిజ్బుల్ ముజాహిద్దిన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్‌ను హతమార్చింది. రాంబన్‌ జిల్లా భద్రతాబలగాలు శనివారం చేపట్టిన భారీ ఆపరేషన్‌లో హిజ్బుల్ టాప్ కమాండర్‌ ఒసామాతోపాటు మరో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టంది. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కశ్మీర్‌లో సైన్యం చేపట్టిన తొలి భారీ ఆపరేషన్‌ ఇదే. ఈ ఎన్‌కౌంటర్ దాదాపు తొమ్మిది గంటలకుపైగా కొనసాగింది. అంతేకాదు ఈ ఘటనలో ఒక కుటుంబాన్ని ఉగ్రవాదుల చెరనుంచి కాపాడింది. అయితే ఈ క్రమంలో జవాన్‌ రాజేందర్‌ సింగ్‌ వీరమరణం పొందారు.

భారత ఆర్మీ అధికారులు తెలిపిన వివారల ప్రకారం రాంబన్‌ జిల్లా బటోటే పట్టణానికి సమీపంలోని జమ్ము-కిష్టావర్‌ హైవేపై శనివారం ఉదయం 7:30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్‌ అప్రమత్తమై వాహనాన్ని ఆపకుండా పోనిచ్చాడు. సమీపంలోని ఆర్మీ చెక్‌పోస్ట్‌కు వెళ్లి అధికారులకు జరిగిన తతంగాన్ని తెలిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు హైవేపై కూంబింగ్ చేపట్టాయి. అయితే ధర్ముండ్‌ గ్రామం సమీపానికి చేరుకోగానే ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ నేపథ్యంలో భద్రతాబలగాలు గాలింపును ముమ్మరం చేశాయి.

ఉగ్రవాదులను లొంగిపోవాలని హెచ్చరించిన ఆర్మీ ధీర వనిత…

ఉగ్రవాదులు బటోటే పట్టణంలోని ప్రధాన మార్కెట్‌ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలోకి చొరబడ్డారు. ఇంటియజమాని, స్థానిక బీజేపీ నేత విజయ్‌కుమార్‌, అతడి కుటుంబ సభ్యులను బందీలుగా తీసుకున్నారు. అయితే ఈ సమయంలోనే సైనికులు కార్డన్ సర్చ్ చేపడుతుండగా.. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అలర్ట్ అయిన సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఉగ్రవాదులను హతం చేయడం, బందీలను విడిపించడమే లక్ష్యంగా ఆపరేషన్‌ మొదలుపెట్టాయి. అయితే ఈ సందర్భంగా ఉగ్రవాదులను లొంగిపోవాలంటూ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆర్మీ మాటలను లెక్కచేయకుండా కాల్పులకు తెగబడింది.

అయితే మధ్యాహ్నం ప్రారంభమైన ఎదురుకాల్పులు సాయంత్రానికి ముగిశాయి. ముందుగా విజయ్‌ కుటుంబ సభ్యులు ఉగ్రవాదుల చెరనుంచి తప్పించుకొని బయటికి రాగా, సైన్యం వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించింది. చివరికి ఇంటి యజమాని విజయ్‌కుమార్‌ను రక్షించింది. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతం చేసినట్టు లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఆనంద్‌ తెలిపారు. వారిని ఒసామా, జహీద్‌, ఫరూఖ్‌లుగా గుర్తించామన్నారు. ఈ ఆపరేషన్‌లో జైసల్మేర్‌కు చెందిన రాజేందర్‌ సింగ్‌ అనే జవాన్‌ వీరమరణం పొందినట్టు తెలిపారు. మరో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు.

కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా..

పాకిస్థాన్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన టాప్ కమాండర్ ఒసామా.. దేశంలో జరిగిన అనేక ఉగ్ర దాడుల్లో పాల్గొన్నాడు. దీంతో అతడిని భారత ప్రభుత్వం వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా ప్రకటించి.. అతడి తలపై నగదు బహుమతి కూడా ప్రకటించింది. గతేడాది ఏప్రిల్‌ 9న ఆరెస్సెస్‌ నేత చంద్రకాంత్‌ శర్మ, అతడి సహచరుడి హత్య, నవంబర్‌ 1న బీజేపీ సీనియర్‌ నేత అనిల్‌ పరిహర్‌, అతడి సోదరుడు అజిత్‌ పరిహర్‌ హత్యలకు ఒసామానే నేతృత్వం వహించాడు. వీటితోపాటు కిష్టావర్‌ పట్టణంలో ఆయుధాలను దొంగిలించిన మూడు కేసుల్లోనూ అతడు నిందితుడుగా ఉన్నాడు.