భారీ వర్షాలతో ఉత్తరాది విలవిల.. యూపీలో నాలుగు రోజుల్లో 73 మంది మృతి
ఉత్తరాదిని భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. ఒక్క యూపీలోనే నాలుగు రోజుల్లో 73 మంది మృతి చెందారు. ఈ వారం రోజుల్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రెడ్ ఎలర్ట్ జారీ చేసే విషయమై అధికారులు యోచిస్తున్నారు. సాధారణానికి మించి 1700 శాతం వర్షాలు పడినట్టు అంచనా. ప్రయాగ్ రాజ్ లో ఈ రెండుమూడు రోజుల్లోనే 102.2 మి. మీ., వారణాసిలో 84.2 మి. మీ. మేర వర్షాలు కురిశాయి. శనివారం నాడు 26 మంది మృత్యువాత పడగా.. గురు, శుక్రవారాల్లో […]
ఉత్తరాదిని భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. ఒక్క యూపీలోనే నాలుగు రోజుల్లో 73 మంది మృతి చెందారు. ఈ వారం రోజుల్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రెడ్ ఎలర్ట్ జారీ చేసే విషయమై అధికారులు యోచిస్తున్నారు. సాధారణానికి మించి 1700 శాతం వర్షాలు పడినట్టు అంచనా. ప్రయాగ్ రాజ్ లో ఈ రెండుమూడు రోజుల్లోనే 102.2 మి. మీ., వారణాసిలో 84.2 మి. మీ. మేర వర్షాలు కురిశాయి. శనివారం నాడు 26 మంది మృత్యువాత పడగా.. గురు, శుక్రవారాల్లో వివిధ ప్రాంతాల్లో 47 మంది మరణించారు. లక్నో, అమేథీ, హర్దోయ్ తో బాటు మరికొన్ని జిల్లాల్లో స్కూళ్లను రెండురోజులుగా మూసివేశారు. భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు 4 లక్షల చొపున పరిహారాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. అటు-బీహార్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. రాజధాని పాట్నాలో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పౌర జీవనం స్తంభించిపోయింది. ఆదివారం కనీసం 13 రైలు సర్వీసులను రద్దు చేశారు.
Scene from Hajipur pic.twitter.com/DGIbwmSl6b
— bhakhtt (@basher24) September 28, 2019
పలు రూట్లలో రైళ్లను దారి మళ్లించారు. ఈ నెల 30 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. నలందా మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఆవరణ అంతటా నీటితో నిండిపోయింది. వరద పరిస్థితి వంటిది ఏర్పడడంతో సహాయక బృందాలతో బాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు కూడా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. సీఎం నితీష్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులతో సమీక్షిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలకు రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆరుగురు, జమ్మూ కాశ్మీర్లో ఒకరు మృతి చెందారు. మధ్యప్రదేశ్ లోని సియోనీ జిల్లాలో వర్షపు నీటి ప్రవాహానికి ఓ పోలీసు కానిస్టేబుల్ తో బాటు ముగ్గురు కొట్టుకుపోయారు. సుమారు కిలోమీటర్ దూరంలో వీరి మృత దేహాలను కనుగొన్నారు. జలమయమైన ప్రాంతాల్లో బోట్లలో బాధితులను తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నట్టు వారు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేస్తున్నామన్నారు.