తేజస్వీ యాదవ్‌పై చెప్పులు విరిసిన ఆగంతకులు
బీహార్‌లో ఎన్నికల వేడి పెరిగింది.. ప్రచారం హోరెత్తుతోంది.. పార్టీల అధినాయకులంతా సభలు సమావేశాలతో బిజీగా ఉంటున్నారు.. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాష్ట్రీయ జనతాదళ్ నేత, విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌కు...
బీహార్‌లో ఎన్నికల వేడి పెరిగింది.. ప్రచారం హోరెత్తుతోంది.. పార్టీల అధినాయకులంతా సభలు సమావేశాలతో బిజీగా ఉంటున్నారు.. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాష్ట్రీయ జనతాదళ్ నేత, విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌కు ఔరంగాబాద్ జిల్లాలో చేదు అనుభవం ఎదురయ్యింది కానీ ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోకుండానే ప్రచారం కంటిన్యూ చేశారు. కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రచారం కోసం వచ్చిన తేజస్వీ యాదవ్ సభా వేదికకపై కూర్చున్నారు.. పార్టీ నేతలేమో తేజస్వీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు.. సరిగ్గా ఈ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరారు.. ఆకస్మాత్తుగా దూసుకొచ్చిన చెప్పులలో ఒకటి ఆయన తల పక్క నుంచి వెనక్కి వెళ్లిపోయింది.. మరో చెప్పు ఆయన చేతులకు తగిలింది.. తేజస్వీ పైకి చెప్పులు విసిరినవారు ఎవరో..? ఎందుకు విసిరారో…? మాత్రం తెలియదు.. అయితే ఈ సంఘటనను చాలా తేలిగ్గా తీసుకున్న తేజస్వీ ప్రసంగాన్ని ఆపలేదు.. గమనించదగ్గ విషయమేమిటంటే ప్రసంగంలో చెప్పుల సంఘటన గురించి చెప్పకపోవడం… అయితే ఆర్‌జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాత్రం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు ముగిసేవరకు విపక్ష నేతలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.. ఈ ఎన్నికలలో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఆర్‌జేడీ బరిదో దిగుతుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో ఆర్‌జేడీ 144 స్థానాల నుంచి పోటీ చేస్తోంది. అక్కడ ఎన్డీయేకే అవకాశాలున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి..