Omicron Effect on Doctors: ఒమిక్రాన్ బారిన పడుతున్న వైద్యులు.. అదే జరిగితే పరిస్థితి ఏంటని ఆందోళన..!

Omicron Effect on Doctors: భారతదేశంలో ఓమిక్రాన్ ప్రభావం రోజు రోజుకు తీవ్రమవుతోంది. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి.

Omicron Effect on Doctors: ఒమిక్రాన్ బారిన పడుతున్న వైద్యులు.. అదే జరిగితే పరిస్థితి ఏంటని ఆందోళన..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 05, 2022 | 10:51 AM

Omicron Effect on Doctors: భారతదేశంలో ఓమిక్రాన్ ప్రభావం రోజు రోజుకు తీవ్రమవుతోంది. కరోనా ఇన్ఫెక్షన్ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అయితే, కరోనా వైరస్ సామాన్యులతో పాటు కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులకు కూడా కరోనా సోకుతోంది. ఢిల్లీలో ఇప్పటివరకు 50 మందికి పైగా వైద్యులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎయిమ్స్‌లో 7, సఫ్దర్‌జంగ్‌లో 23, ఆర్‌ఎంఎల్‌లో 5, లోక్‌నాయక్‌లో 5, లేడీ హార్డింజ్ హాస్పిటల్‌లో 10, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో 3 చొప్పున వైద్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. బీహార్‌లోని నలంద మెడికల్ కాలేజీ హాస్పిటల్ (NMCH)లో ఇప్పటివరకు మొత్తం 153 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పాట్నాలోని ఎయిమ్స్‌లో నలుగురు వైద్యులు కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో అధిక సంఖ్యలో రెసిడెంట్ వైద్యులు ఉన్నారు. ఈ పరిస్థితులు వైద్యులలో కరవరాన్ని పెంచుతున్నాయి. పెద్ద ఎత్తున వైద్యులు కరోనా బారిన పడుతుండటంతో.. వైద్య సేవలపై పెను ప్రభావం పడుతుందని ఆందోళనలు రేకెత్తుతున్నాయి.

వైద్యులకు కరోనా సోకడంపై ఢిల్లీకి చెందిన ఓ వైద్యాధికారి అనధికారికంగా కీలక వివరాలు వెల్లడించారు. కరోనా బారిన పడిన వైద్యుల పరిస్థితిని వివరించారు. కరోనా బారిన పడిన చాలా మందిలో తేలికపాటి లక్షణాలే ఉన్నాయని తెలిపారు. బాధిత వైద్యుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు తెలిపారు. దీని రిజల్ట్స్ వస్తే ఒమిక్రాన్ వేరియంట్, డెల్టానా అని తేలుతుందన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం.. బాధిత వైద్యులంతా ఐసోలేషన్‌కు పంపుతున్నట్లు తెలిపారు. కాగా, చాలామంది వైద్యులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు. క్వారంటైన్ నిబంధనలను రాబోయే రోజుల్లో సమీక్షించనున్నట్లు తెలిపారు. కాగా, వైద్యులు కరోనా బారిన పడుతుండటంతో వైద్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆసుపత్రుల్లో రోగులు పెరగకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదని, పరిస్థితి విషమిస్తే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఢిల్లీ వైద్యాధికారులు చెబుతున్నారు.

AIIMS వైద్యులు ఏమంటున్నారు? AIIMS లో విధులు నిర్వర్తిస్తున్న కోవిడ్ నిపుణులు డాక్టర్ యుధ్వీర్ సింగ్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసులు పెరిగినా.. ఆస్పత్రుల్లో చేరకపోవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కరోనా సోకిన వారి సంఖ్య తక్కువగా ఉంటే.. చికిత్స విషయంలో పెద్దగా సమస్య ఉండదన్నారు. కాగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేసిందన్న ఆయన.. దీని ప్రకారం, తక్కువ లక్షణాలు ఉన్న వైద్యులు ఐదు రోజుల క్వారంటైన్ తర్వాత విధుల్లో చేరవచ్చని తెలిపారు.

పెద్దగా సమస్య ఉండకపోవచ్చు.. ‘‘ఒమిక్రాన్ సోకిన వారిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. కావున, వైద్యులు ఐదు రోజుల్లో తిరిగి విధుల్లో చేరవచ్చు. అయితే, వైద్యులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతుండటంతో ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అయినప్పటికీ, రెండో వేవ్‌లో చూసినట్లుగా దారుణ పరిస్థితి ఉండకపోవచ్చు. సెకండ్‌ వేవ్‌లో డెల్టా లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వైద్యులు 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఈ సారి పరిస్థితి భిన్నంగా. ఇప్పుడు కేసుల సంఖ్య పెరిగినా ఆసుపత్రులపై పెద్దగా ఒత్తిడి ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో రోస్టర్‌ ప్రకారం వైద్యులకు డ్యూటీ చార్ట్ వేస్తున్నాం.’’ అని ఢిల్లీలోని మూల్‌చంద్‌ ఆస్పత్రి పల్మనాలజీ హెచ్ఓడీ భగవాన్‌ మంత్రి తెలిపారు.

ఆన్‌లైన్ ట్రీట్‌మెంట్.. ఒమిక్రాన్ లక్షణాలు తక్కువగా ఉండటంతో బాధితులు ఇంట్లోనే చికిత్స పొందవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు వైద్యులకు కరోనా పాజిటివ్ తేలుతుండటం అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఒకవేళ వైద్యులు భారీ సంఖ్యలో కరోనా భారిన పడినట్లయితే.. పరిస్థితి ఏంటా అని తలలు పట్టుకుంటున్నారు. అయితే, మరేం పర్వాలేదు అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వారిలో తేలికపాటి లక్షణాలే ఉంటుండటంతో.. సదరు వైద్యులు ఆన్ లైన్ ద్వారా కూడా ట్రీట్‌మెంట్ ఇవ్వవచ్చు అని చెబుతున్నారు.

సర్ గంగారామ్ ఆసుపత్రికి చెందిన రాజేష్ ఆచార్య మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎవరైనా వైద్యులలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రిపోర్టు పాజిటివ్‌గా వస్తే వెంటనే ఐసోలేట్ అవ్వాలన్నారు. ఎలాంటి లక్షణాలు ఉన్నాయో పరిశీలించాలన్నారు. బాధిత వైద్యులకు ఎలాంటి లక్షణాలు లేనట్లయితే.. వారు ఆసుపత్రిలో కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి రోగికి సేవలు అందించవచ్చు అని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే చాలా మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. వ్యాక్సీన్ రెండు డోసులు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులకు కరోనా వచ్చినా.. పెద్దగా లక్షణాలు ఉండకపోవచ్చని, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అన్నారు.

కరోనా విధ్వంసం.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఒక్క రోజే 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది గత సంవత్సరం జూన్ తరువాత అత్యధికం. కరోనా సోకిన వారిలో 81 శాతం మందిలో ఓమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయ్యింది. ఢిల్లీలో ఈ వేరియంట్ కేసులే భారీగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. వేగంగా పెరుగుతున్న కేసులతో.. యాక్టీవ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. పాజిటివిటీ రేటు కూడా 6 శాతానికి మించిపోయింది. ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 12,160 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 37,274కి చేరింది. మహారాష్ట్రల్లో కూడా ఓమిక్రాన్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. హర్యానా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉపశమనం కలిగిస్తున్న దక్షిణాఫ్రికా అధ్యయనం.. తాజాగా దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి ఏర్పడుతుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు.. ఇది డెల్టా ప్రభావాన్ని తగ్గిస్తుందట. ఒమిక్రాన్ సోకిన వారిలో తేలికపాటి లక్షణాలు ఉంటే.. ప్రమాదం ఉండదని చెబుతున్నారు. జలుబు, జ్వరం వంటి లక్షణాలు మాత్రమే ఉంటాయంటున్నారు. మునుపటి డెల్టా వైరస్ కంటే తక్కువ ప్రాణాంతకం అని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రపంచ జనాభాలో 80 శాతం మందికి ఒమిక్రాన్.. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు అఫ్షిన్ ఇమ్రానీ.. ప్రపంచ జనాభాలో 80 శాతం మందికి ఒమిక్రాన్ సోకుతుందని చెప్పారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కూడా కరోనా బారిన పడతారన్నారు. ఒకవేళ వైద్యులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడితే.. ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. కానీ, ఒమిక్రాన్ సాధారణ ఫ్లూ మాత్రమే అని నిపుణులు చెబుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. ఒకవేళ ఆస్పత్రి సిబ్బందికి ఒమిక్రాన్ సోకినట్లయితే.. మాస్క్ ధరించి చికిత్స అందించవచ్చు అని అఫ్షిన్ పేర్కొన్నారు.

సెకండ్ వేవ్‌లో కరోనా బారిన పడిన వైద్యులు.. దేశంలో సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో వైద్యులను 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచాల్సి వచ్చింది. దాంతో చాలా మంది రోగులకు వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. ఐఎంఏ ప్రకారం.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశ వ్యాప్తంగా 500 మందికి పైగా వైద్యులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే, తాజాగా ఇప్పటి వరకు దేశంలో 1,800 మందికి పైగా బాధితులు ఓమిక్రాన్ బారిన పడ్డారు. వీరి సంఖ్యంగా క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది. 766 మంది ఒమిక్రాన్ బాధితులు ఇప్పటికే కోలుకున్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో తేలికపాటి లక్షణాలే ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో వైద్యులకు కరోనా సోకితే ప్రభుత్వం ఏ వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి.

4 లక్షల ఓమిక్రాన్ బాధితుల్లో 64 మంది మృతి.. బీహార్‌కు చెందిన ప్రముఖ శిశువైద్యుడు డాక్టర్ అరుణ్ సాహా మాట్లాడుతూ.. ప్రపంచంలోని 4 లక్షల మంది ఓమిక్రాన్ బారిన పడగా.. వీరిలో కేవలం 64 మంది మాత్రమే మరణించారని, వారిలో ఎక్కువ మంది ఇతర వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇది సాధారణ ఫ్లూ వైరస్‌ మాత్రమే చెప్పుకొచ్చారు. ఈ కారణంగా ఆరోగ్య సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు.

Also read:

Twins born: వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు.. అరుదైన ఘటన వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Fraud Case: ఒకే గ్రామంలో 200 మంది బకరా అయ్యారు.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఎగిరిపోవడం ఖాయం..

ASI Kicks Passenger: టికెట్ లేదని ప్రయాణికుడిని పొట్టు పొట్టు కొట్టాడు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు