ASI Kicks Passenger: కేరళలో దారుణ ఘటన జరిగింది. టికెట్టు లేకుండా ప్రయాణిస్తున్నాడని ఓ ప్రయాణికుడిని ఏఎస్‌ఐ కాలితో తన్నాడు. వివరాల్లోకెళితే.. తిరువనంతపురం వెళ్తున్న మావేలీ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్ బోగీలో తలుపు వద్ద నేలపై కూర్చున్నాడు ఓ ప్రయాణికుడు. ఇంతలో బోగీలన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్న ఏఎస్‌ఐ ప్రమోద్ ఆ ప్రయాణికుడిని టికెట్ చూపించాలని అడిగాడు. అతని వద్ద టికెట్ లేకపోవడంతో ఏఎస్ఐ ఆగ్రహించాడు. ఇంకేముంది.. అధికారం దర్పం, తానేం చేసినా చెల్లుతుందనే కండకావడంతో ప్రయాణికుడిపై విరుచుకుపడ్డాడు ఏఎస్ఐ. బూటు కాలితో సదరు ప్రయాణికుడిని పదే పదే తన్నాడు. తీవ్రంగా చితకబాదాడు. తర్వాత వడకరా స్టేషన్‌లో అతడిని ట్రైన్‌నుంచి గెంటేశాడు. అయితే, అదే ట్రైన్‌లో ఉన్న మరికొందరు ప్రయాణికులు ఈ సీన్ మొత్తాన్ని తమ మొబైల్‌లో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. అటు తిరిగి ఇటు తిరిగి ఉన్నతాధికారుల కంట పడింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రయాణికుడిపై దాడి చేసిన ఏఎస్‌ఐ ప్రమోద్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
Also read:
Viral Video: అందమైన ‘అల్బీనో స్నేక్’..సొగసు చూడతరమా..!
IND vs SA: ఆఫ్రికన్ గడ్డపై బుమ్రా, శార్దుల్ విధ్వంసం.. గాయాలపాలైన సౌతాఫ్రికా బ్యాటర్లు..!
Sara Ali Khan : లవ్ అంటూ ఇద్దరిని ముంచావ్.. ఇప్పుడు మూడో వాడు అలా ఉండాలా..(Video)