Twins born: వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు.. అరుదైన ఘటన వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Twins born: ఇద్దరు కవల పిల్లలు కేవలం 15 నిమిషాల తేడాతో వేర్వేరు తేదీల్లో పుట్టడం ఎప్పుడైనా చూశారా... పోనీ విన్నారా... ఆశ్చర్యంగా ఉంది కదూ.. కవలలేంటి వేర్వేరు తేదీల్లో పుట్టడమేంటని..

Twins born: వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు.. అరుదైన ఘటన వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Twins
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 05, 2022 | 9:58 AM

Twins born: ఇద్దరు కవల పిల్లలు కేవలం 15 నిమిషాల తేడాతో వేర్వేరు తేదీల్లో పుట్టడం ఎప్పుడైనా చూశారా… పోనీ విన్నారా… ఆశ్చర్యంగా ఉంది కదూ.. కవలలేంటి వేర్వేరు తేదీల్లో పుట్టడమేంటని.. కానీ పుట్టారు.. అవును.. వారిద్దరూ కవలల పిల్లలే. 15 నిమిషాల తేడాతో వేర్వేరు తేదీల్లో, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది ఈ సంఘటన. గ్రీన్‌ఫీల్డ్ సిటీకి చెందిన ఫాతిమా మాడ్రిగల్ పురిటినొప్పులతో డిసెంబరు 31న స్థానిక నటివిడాడ్ మెడికల్ సెంటర్‌లో చేరారు. ఆ రోజు రాత్రి 11.45 గంటల సమయంలో ఆమె బాబుకు జన్మనిచ్చారు. ఆ తర్వాత 15 నిమిషాలకు అంటే 12 గంటలకు పాపకు జన్మించింది. అంటే బాబు 31 డిసెంబరు 2021న జన్మిస్తే, పాప మాత్రం 1 జనవరి 2022న జన్మించినట్టు అయింది. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఫేస్‌బుక్ ద్వారా పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది. కవలల తల్లి మాడ్రిగల్ ఈ విషయంపై చాలా ఆనందంగా ఉందని, బాబుకు ఆల్ఫ్రెడో అని, పాపకు అలీన్ అని పేర్లు పెట్టినట్టు చెప్పారు.

Also read:

Viral Video: అందమైన ‘అల్బీనో స్నేక్‌’..సొగసు చూడతరమా..!

IND vs SA: ఆఫ్రికన్ గడ్డపై బుమ్రా, శార్దుల్ విధ్వంసం.. గాయాలపాలైన సౌతాఫ్రికా బ్యాటర్లు..!

Sara Ali Khan : లవ్‌ అంటూ ఇద్దరిని ముంచావ్‌.. ఇప్పుడు మూడో వాడు అలా ఉండాలా..(Video)