AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: రాహుల్ ఆలయ దర్శనాన్ని అడ్డుకున్న అధికారులు.. కాంగ్రెస్ దేశ వ్యాప్త నిరసనలు

రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన తొలిరోజు నుంచే అనేక చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మణిపుర్ లో పాదయాత్ర ముగించుకుని అసోంలో అడుగుపెట్టిన సమయంలో యాత్ర నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అనుమతి లేని ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగించారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే సోమవారం ఉదయం బటాద్రవ థాన్ అనే ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్‌ గాంధీని.. అక్కడి అధికారులు లోపలికి అనుమతిని నిరాకరించారు.

Rahul Gandhi: రాహుల్ ఆలయ దర్శనాన్ని అడ్డుకున్న అధికారులు.. కాంగ్రెస్ దేశ వ్యాప్త నిరసనలు
Rahul Gandhi
Srikar T
|

Updated on: Jan 22, 2024 | 3:53 PM

Share

అసోం, జనవరి 22: రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టిన తొలిరోజు నుంచే అనేక చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మణిపుర్ లో పాదయాత్ర ముగించుకుని అసోంలో అడుగుపెట్టిన సమయంలో యాత్ర నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అనుమతి లేని ప్రాంతాల్లో పాదయాత్ర కొనసాగించారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే సోమవారం ఉదయం బటాద్రవ థాన్ అనే ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్‌ గాంధీని.. అక్కడి అధికారులు లోపలికి అనుమతిని నిరాకరించారు. దీంతో రాహూల్ గాంధీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘‘మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేం నేరం చేశా? ఎందుకు ఆలయంలోకి అనుమతించడం లేదు?.. మేం సమస్యల్ని సృష్టించడానికి రాలేదు. కేవలం పూజలు చేసి వెళ్తాం. ఆలయంలో ఎవరు ప్రవేశించాలో కూడా ప్రధాని మోదీనే నిర్ణయిస్తారా ఏంటి? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే అలయంలోకి ప్రవేశించడాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను నిలదీశారు.

ఈ ఘటన తర్వాత నాగోవ్‌లో స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే ఆలయ ఆలయ అధికారులు పలు విషయాలు వెల్లడించారు. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కొనసాగుతున్నందున దర్శనాన్ని తాత్కాలికంగా మూసివేశామని చెప్పారు. అక్కడి కార్యక్రమాలు అన్నీ పూర్తైన తరువాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రతి ఒక్కరినీ లోనికి అనుమతిస్తామని చెప్పుకొచ్చారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రమే ఇవాళ ప్రాణప్రతిష్ట వేళ లోనికి అనుమతి ఉంటుందని ఒక ప్రకటన చేసినట్లు తెలిపింది ఆలయ కమిటీ. బటాద్రవ థాన్‌ ఆలయం 15వ శతాబ్దం నాటిది. అక్కడ అసోం సంఘసంస్కర్త శ్రీమంత శంకర్‌దేవ్‌ జన్మించినట్లు చెబుతారు. ఈ ఆలయ దర్శనం కోసం రాహుల్ గాంధీ ప్రయత్నించగా ఆదివారం సాయంత్రం వరకూ ఆలయ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు స్పష్టంగా ఉన్నందునే తనను అనుమతించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆరోపించారు.

ఇదే నేపథ్యంలో అసోం సీఎం హిమంత బిస్వాశర్మ కీలక ప్రకటన చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న తరుణంలో యాత్ర దిశను మార్చుకోవల్సిందిగా రాహుల్ గాంధీకి సూచించారు. దీనిపై రాహుల్ స్పందించని కారణంగా ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాహుల్ రూట్ మార్చుకోవాలని లేకుంటే ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితి ఉందని అలాంటి వాటికి కారణం కావొద్దని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం సాయంత్రం దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయితే ఒకవైపు రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేళ ఎలాంటి పరిస్థితులకు కారణమవుతుందో అని దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..