Odisha Train Accident: రైలు ప్రమాదంలో 237కు చేరిన మృతుల సంఖ్య.. హై లెవెల్‌ విచారణకు ఆదేశించిన కేంద్రం

సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా కుదుపు. అసలేం జరుగుతుందో తెలిసేలోపే ప్రయాణికులను మృత్యువు కమ్మేసింది. తాము ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పిందని తెలుసుకునేలోపే ఒకదాని తర్వాత ఒకటి రెండు రైళ్లు అసలు తప్పించుకునే ఛాన్సే లేకుండా పోయింది. స్పాట్‌లోనే కొందరు, బోగీల్లో ఇరుక్కుపోయి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్‌ స్పాట్‌ భీతావహంగా మారింది.

Odisha Train Accident: రైలు ప్రమాదంలో 237కు చేరిన మృతుల సంఖ్య.. హై లెవెల్‌ విచారణకు ఆదేశించిన కేంద్రం
Odisha Train Accident

Edited By: Ravi Kiran

Updated on: Jun 03, 2023 | 11:02 AM

సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా కుదుపు. అసలేం జరుగుతుందో తెలిసేలోపే ప్రయాణికులను మృత్యువు కమ్మేసింది. తాము ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పిందని తెలుసుకునేలోపే ఒకదాని తర్వాత ఒకటి రెండు రైళ్లు అసలు తప్పించుకునే ఛాన్సే లేకుండా పోయింది. స్పాట్‌లోనే కొందరు, బోగీల్లో ఇరుక్కుపోయి మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్‌ స్పాట్‌ భీతావహంగా మారింది. దాదాపు 30 కోచ్‌లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుకి వందలాది మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయ్‌. బోగీల్లో ఇరుక్కున్న బాధితుల హాహాకారాలతో దద్దరిల్లిపోయింది ఆ ప్రాంతం. అరుపులు, కేకలు, ఏడుపులతో మృత్యు లోకాన్ని తలపించింది. ప్రస్తుతమున్న సమచారం ప్రకారం ఇప్పటివరకు 237 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. దీనిపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర రైల్వే మంత్రి హై లెవెల్‌ విచారణకు ఆదేశించింది. మరోవైపు ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాప సూచకంగా నేడు (జూన్‌ 3)ను సంతాప దినంగా ప్రకటించింది ఒడిశా ప్రభుత్వం. ఇక కొద్ది సేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు నవీన పట్నాయక్‌.

ఒడిషా రాజధాని భువనేశ్వర్‌తోపాటు ఐదు ప్రధాన నగరాల్లోని ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయ్‌. బాలేశ్వర్‌, భువనేశ్వర్‌, భద్రక్‌, మయూర్‌బంజ్‌, కటక్‌ల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు వందలమందిని తరలించారు. వందలకొద్దీ అంబులెన్సులతో క్షతగాత్రులను షిఫ్ట్‌ చేస్తున్నారు అధికారులు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన ప్రయాణికులు ఇప్పటికీ అదే ట్రాన్స్‌లో ఉన్నారు. యాక్సిడెంట్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. ప్రమాదాన్ని జరిగిన తీరును చెబుతూ భయాందోళనకు గురవుతున్నారు. తమ పని అయిపోయిందనుకున్నాం, కానీ అదృష్టంకొద్దీ ప్రాణాలతో బయటపడ్డామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..