Students Hospitalised: సెలవుల కోసం చేసిన పని తోటి విద్యార్థుల ప్రాణం మీదకు వచ్చింది.. అసలు విషయం వెలుగులోకి రావడంతో..!
ఓ విద్యార్థి ఒమిక్రాన్ వేరియంట్ భయంతో కూడా కాలేజీ యాజమాన్యాలు సెలవులు ఇస్తాయని ఆశ పడ్డాడు. అయితే, ఎంతకి తాను ఆశించినట్టుగా తమ కాలేజికి మాత్రం సెలవులు రాకపోవడంతో ఓ విద్యార్థి విచిత్రంగా ఫ్లాన్ చేశాడు.
Odisha school students hospitalised: కరోనా కాలంలో లాక్‌డౌన్ కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి.. చదవులున్ని ఆన్‌లైన్ కావడంతో ఇంటికే పరిమితమయ్యారు విద్యార్థులు.. మరోవైపు, ఇంటిపట్టునే ఉంటూ సెలవులను బాగా ఎంజాయ్ చేస్తుంటారు.. ఇలా సెలవులకు అలవాటిని విద్యార్థులు.. గత కొద్ది రోజులుగా తిరిగి విద్యాసంస్థలు ఓపెన్ కావడంతో మెల్ల మెల్లగా తరగతుల బాట పడుతున్నారు. అయితే, సాధారణంగా క్లాసులు ఇష్టం లేని తుంటరి పిల్లలు బంక్ కొడుతూ ఉంటారు. అయితే, ఒడిశాకు చెంది ఓ విద్యార్థి సెలవు కోసం చేసిన పనికి తోటి విద్యార్థుల ప్రాణం మీదకు వచ్చింది.
కరోనా కాలంలో అలవాటు పడిన ఓ విద్యార్థి ఒమిక్రాన్ వేరియంట్ భయంతో కూడా కాలేజీ యాజమాన్యాలు సెలవులు ఇస్తాయని ఆశ పడ్డాడు. అయితే, ఎంతకి తాను ఆశించినట్టుగా తమ కాలేజికి మాత్రం సెలవులు రాకపోవడంతో ఓ విద్యార్థి విచిత్రంగా ఫ్లాన్ చేశాడు. ఒమిక్రాన్ భయాన్ని కాలేజీలో సృష్టిస్తే.. భయపడి సెలవులు ఇస్తారని భావించాడు. దీంతో తోటి విద్యార్థినులను బలి చేశాడు. వాళ్లు తాగే నీళ్లలో విషం కలిపాడు.
ఒడిశాలోని బర్‌గార్ జిల్లాకు చెందిన కామగాన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌ల్లో ఇంటర్ చదివే విద్యార్థి తన 20 మంది స్నేహితులకు బాటిల్ నీళ్లలో విషం కలిపి ఇచ్చాడు. ఆ బాటిల్లోని నీళ్లు తాగిన వారంతా వాంతులు, వికారంతో బాధపడుతుండటంతో వారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరికొందరు చికిత్స అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా, ఈ హఠాత్తు పరిణామంతో ఆందోళన చెందిన అధికారులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పాఠశాలకు సెలవులు ఇవ్వడంలేదని తోటి విద్యార్థుల వాటర్ బాటిళ్లలో విషం కలపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నాట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ ప్రేమానంద్ పటేల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మరోమారు లాక్‌డౌన్ విధించే అవకాశం లేకపోవడంతో ఓ విద్యార్థి నేరానికి పాల్పడినట్లు తెలిపాడు. అయితే, అనారోగ్యంపాలైన విద్యార్ధుల తల్లిదండ్రులు.. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడిన సదరు విద్యార్ధిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఆ విద్యార్థి కరోనా ఫస్ట్‌వేవ్‌తో పాటు సెకండ్ వేవ్‌లో కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారని ఇప్పుడు కూడా అలాగే ఆశించాడని తెలిపారు.
ఈ క్రమంలోనే విద్యార్ధి కెరీర్‌తో పాటు వయసును దృష్టిలో ఉంచుకుని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపల్ తెలిపారు.. కానీ యాజమాన్యం మాత్రం ఆ విద్యార్థిపై చర్యలు తీసుకున్నారు. కొన్ని రోజులు ఆ విద్యార్థిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.