Wedding Video: పెళ్లిలో అమ్మాయిల జోష్.. కాక్‌టెయిల్ మూవీ సాంగ్ కి డాన్స్‌తో రచ్చ రచ్చ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Wedding Video Viral: ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వాహా వేడుకల్లో జరిగే డాన్స్ కార్యక్రమాలు, ఫన్నీ సన్నివేశాలు..
Wedding Video Viral: ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. వాహా వేడుకల్లో జరిగే డాన్స్ కార్యక్రమాలు, ఫన్నీ సన్నివేశాలు అన్నీ సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు. నెటిజన్లు వీటిని బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ పెళ్లి బరాత్‌లో అమ్మాయిలు చేసిన డాన్స్ తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా బ్యాండ్ బాజా బరాత్‌లో మగవాళ్లు గ్రూప్ డాన్సులు చేస్తారు. అలాంటిది పంజాబ్‌లో జరిగిన ఓ పెళ్లిలో యువతులు చెలరేగిపోయారు. డప్పు చప్పుళ్లకు తగ్గట్టు స్టెప్స్ వేస్తూ.. అందరిలోను జోష్ పెంచేశారు. పెళ్లి బరాత్‌లో డప్పు వాయిస్తున్న వారి వద్దకు వెళ్లి ఇంకా జోరుగా కొట్టాలంటూ వారిలో ఉత్సాహం నింపారు. దాంతో బ్యాండ్ బాజా టీమ్ మరింతగా బీట్ పెంచేసింది. దాంతో అమ్మాయిలు చెలరేగి స్టెప్పులతో అదరగొట్టారు. వారి హంగామాతో… పెళ్లి వేడుకలో ఒక్కసారిగా సందడి పెరిగింది.
పంజాబీ పెళ్లిళ్ల బ్యాండ్ బాజాలో కంటిన్యూగా బీట్ ఉంటుంది. అందువల్ల డాన్స్ చేసేవారికి అది ఎక్కడలేని ఉత్సాహం తెస్తుంది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లోని shaadisaga ఖాతాలో పోస్ట్ చేశారు. దీపికా పదుకొనే , సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘కాక్‌టెయిల్’ సినిమాలోని హనీ సింగ్ పాడిన ‘ మెయిన్ షరాబి ‘ పాటకు అమ్మాయిలు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా బాటిల్ గ్రీన్ లెహంగా డ్రెస్సుల్లో అమ్మాయి చేసిన అమ్మాయి డ్యాన్స్ నెటిజన్లకు బాగా నచ్చుతోంది. ఇందులో ఒక అమ్మాయి మద్యం తాగి డాన్స్ చేసినట్లు తెలిసింది. మద్యం మత్తులో ఉండటం వల్లే ఆమె అంతలా రెచ్చిపోయిందని టాక్. ఇక ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చుతోంది. వీడియోపై రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఫన్నీ, హార్ట్ సింబల్ ఇమోజీలను పోస్ట్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: పెళ్లి ఇంట్లో భారీ చోరీ.. మొబైల్ సిగ్నల్ ఆధారంగా నగలు గుర్తించిన పోలీసులు..