నదిలో మునిగిపోయిన 500 ఏళ్లనాటి ఆలయం..ఇప్పుడు వెలుగులోకి..
సుమారు 500 ఏండ్ల కింద నీట మునిగిన ఓ పురాతన గుడి ఇప్పుడు బయటపడింది. 60 అడుగుల ఎత్తున్న ఉన్న ఈ పురాతన ఆలయం 15వ లేదా 16వ శాతాబ్దానికి చెందినగా పురాతత్వ పరిశోధకులు దీన్ని గుర్తించారు. కాగా 11 ఏండ్ల కిందట వేసవిలో చివరిసారి ఈ గుడి పైభాగం కనిపించినట్లు తెలుస్తున్నది.

మహారాష్ట్రలో ఇటీవల 50 ఏళ్ల చరిత్ర గల సరస్సు ఒకటి రంగుమారిన విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి సరస్సులోని నీరంతా ఎరుపు గులాబీ రంగులోకి మారిపోవటంతో అక్కడివారంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోనూ మరో విచిత్రం వెలుగు చూసింది. సుమారు 500 ఏండ్ల కింద నీట మునిగిన ఓ పురాతన గుడి ఇప్పుడు బయటపడింది.
నయాగఢ్‌లో మహానది మధ్య ప్రాంతంలో వెలుగుచూసిన ఈ మందిరాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారు. జాతీయ కళా, సాంస్కృతిక వారసత్వం ట్రస్ట్(ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ INTACH)కు చెందిన పురాతత్వ పరిశోధకులు దీన్ని గుర్తించారు. పడవలో నది అంతా గాలిస్తూ పలు ప్రయత్నాల తర్వాత దీనిని గుర్తించినట్లు ఆ బృందానికి చెందిన దీపక్ కుమార్ నాయక్ తెలిపారు. కటక్ సమీపంలోని పద్మావతి ప్రాంతంలో బైదేశ్వర్ వద్ద నది మధ్యలో ఈ గుడి పై భాగాన్నికనుగొన్నట్లు ఆయన చెప్పారు. 60 అడుగుల ఎత్తున్న ఉన్న ఈ పురాతన ఆలయం 15వ లేదా 16వ శాతాబ్దానికి చెందినగా పేర్కొన్నారు. కాగా 11 ఏండ్ల కిందట వేసవిలో చివరిసారి ఈ గుడి పైభాగం కనిపించినట్లు చెబుతున్నారు.




