Crime News: నర్సుపై గ్యాంగ్‌రేప్‌.. కారులో తీసుకెళ్లి, మద్యం తాగించి మరీ దారుణం..

జిల్లా పోలీసులు ప్రధాన నిందితుడు శరవణన్ (29), అతని ఇద్దరు స్నేహితులు టి. సారథి, ఎస్. సూర్య ప్రకాష్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దారుణ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Crime News: నర్సుపై గ్యాంగ్‌రేప్‌.. కారులో తీసుకెళ్లి, మద్యం తాగించి మరీ దారుణం..
Gangrape
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 29, 2022 | 7:57 PM

తమిళనాడు వెల్లూరులో నర్సుపై గ్యాంగ్‌రేప్‌ ఘటన కలకలం రేపుతోంది. ముగ్గురు యువకులు కలిసి 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూన్ 25 రాత్రి చెన్నై సమీపంలోని వెల్లూరులో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, జిల్లా పోలీసులు ప్రధాన నిందితుడు శరవణన్ (29), అతని ఇద్దరు స్నేహితులు టి. సారథి, ఎస్. సూర్య ప్రకాష్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దారుణ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..21 ఏళ్ల యువతి నర్సుగా పనిచేస్తోంది. చెన్నై సమీపంలోని వేలూరులో మరో చోట జాబ్​ కోసం ఇంటర్వ్యూ ఉండగా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇంటర్వ్యూ కోసం వేలూరుకు వెళ్లింది. అందరూ కలిసి బస్‌కోసం వెల్లూరు బస్టాప్‌లో వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను ఫాలో అవుతూ వచ్చిన శరవణన్ అనే యువకుడు.. ఆమెను భోజనానకని పిలిచి..తన కారులో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు.

మార్గమధ్యలో శరవణన్‌ తన మరో ఇద్దరు స్నేహితులను కూడా వెంటబెట్టుకుని వెళ్లినట్టుగా పోలీసులు వివరించారు. ఆ ఇద్దరు స్నేహితులు బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి టి. సారథి, చెంగల్‌పట్టులోని మేజిస్ట్రేట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది ఎస్. సూర్య ప్రకాష్ కు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు..ముగ్గురు కలిసి ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించారని, ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కేసు విచారణ జరిపిన పోలీసులు తెలిపారు. నిందితుల బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధిత యువతి ఇంటికి చేరుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు గమనించి అడ్డుకోవడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే తల్లిదండ్రులతో కలిసి చెంగల్‌పట్టు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.

కాగా, ఈ మూడు నెలల్లో మెడికల్​ ఫీల్డ్​కు చెందిన ఇద్దరిపై ఇలాంటి ఘటనలు జరగడంతో వెల్లూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో విస్తృత పెట్రోలింగ్‌ను పెంచేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు వెల్లూరు జిల్లా పోలీసులు. ఈ ఏడాది మార్చి 16వ తదే తెల్లవారుజామున వేలూరులోని ఓ ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్‌పై ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నర్సుపై సామూహిక అత్యాచారం జరగడం ఈ జిల్లాలో ఇది రెండో కేసు. దీంతో  తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా  తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి