Helpline Number: భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి అన్ని ఫిర్యాదులు చేయాలంటే 139 నెంబర్‌కే..

Helpline Number: రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం నిరంతరం పలు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఇప్పుడు రైల్వేకు సంబంధించిన..

Helpline Number: భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి అన్ని ఫిర్యాదులు చేయాలంటే 139 నెంబర్‌కే..
Follow us

|

Updated on: Mar 09, 2021 | 10:20 PM

Helpline Number: రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం నిరంతరం పలు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఇప్పుడు రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం వివిధ నంబర్లు డయల్‌ చేయాల్సిన అవసరం లేదు. రైల్వేశాఖ అన్ని హెల్ప్‌లైన్‌ నెంబర్లు విలీనం చేసేసింది. ఇప్పుడు ఈ అన్ని నెంబర్లకు బదులుగా 139 నెంబర్‌ డయల్‌ చేస్తే సరిపోతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇక రైలు ప్రయాణికులు ఇకపై హెల్ప్‌లైన్‌ నెంబర్లన్నీ గుర్తించుకోవాల్సిన అవసరం లేదని రైల్వే తెలిపింది. రైలు ప్రయాణికులు ఇక నుంచి 139 నెంబర్‌కు డయాల్‌ చేసి రైల్వే ప్రయాణానికి సంబంధించి ఏ ఫిర్యాదులైనా తెలియజేయవచ్చని సూచించింది. ఈ కొత్త హెల్ఫ్‌లైన్‌ నెంబర్‌ వినియోగంలోకి రావడంతో మిగిలిన హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇక పని చేయవని రైల్వే శాఖ తెలిపింది.

కాగా, రైళ్ల రాకపోకల సమయాలు, టికెట్‌ బుకింగ్‌ సదుపాయం, రద్దు చేసుకునే సదుపాయం, ప్రయాణ సమయంలో భద్రత, వైద్య సాయం, ఇలా ఎన్నో రకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు రైల్వే శాఖ ఈ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వేశాఖలోని హెల్ప్‌లైన్‌ నెంబర్లను దీనికి అనుసంధానం చేసింది. ప్రస్తుతం హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 182ను 139లో అనుసంధానం చేయబడింది. అయితే ప్రయాణికుల మరింత సులభతరం చేసేందుకు ఇలాంటి సదుపాయలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

ఇవి చదవండి:

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే రెండు రోజుల విమాన ప్రయాణాలు చేయకూడదు.. సౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు

Ayodhya: అయోధ్యలో అత్యాధునిక హంగులతో మరో సదుపాయం.. త్వరలో అందుబాటులోకి వస్తుందన్న కేంద్ర మంత్రి

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి