. ‘ రేప్ ఇన్ ఇండియా ‘.. ఎస్.. సారీ చెప్పను ‘ .. రాహుల్ గాంధీ
‘ రేప్ ఇన్ ఇండియా ‘ (ఇండియాలో అత్యాచారాలు) అన్న తన వ్యాఖ్యపై తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను వాస్తవాన్నే మాట్లాడానని, నిజానికి ప్రధాని మోదీ, ఆయన ‘ అసిస్టెంట్ ‘ (హోం మంత్రి) అమిత్ షాయే క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. ‘ భారత్ బచావో ‘ పేరిట శనివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ సభలో పాల్గొన్న ఆయన.. తన […]
‘ రేప్ ఇన్ ఇండియా ‘ (ఇండియాలో అత్యాచారాలు) అన్న తన వ్యాఖ్యపై తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను వాస్తవాన్నే మాట్లాడానని, నిజానికి ప్రధాని మోదీ, ఆయన ‘ అసిస్టెంట్ ‘ (హోం మంత్రి) అమిత్ షాయే క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. ‘ భారత్ బచావో ‘ పేరిట శనివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ సభలో పాల్గొన్న ఆయన.. తన వ్యాఖ్యకు కట్టుబడే ఉంటానన్నారు. నేను అపాలజీ చెప్పాలన్న బీజేపీ డిమాండును తిరస్కరిస్తున్నానని పేర్కొన్నారు. ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో.. రాహుల్.. ఈ వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్దఎత్తున వివాదం చెలరేగింది. పార్లమెంటులో రభసకు కూడా దారి తీసింది. రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ సభ్యులు డిమాండ్ చేయడమే కాక.. ఎన్నికల సంఘానికి లాంఛనంగా ఫిర్యాదు కూడా చేశారు. అయితే తాను వాస్తవాన్ని మాట్లాడితే అందుకు సారీ ఎందుకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ‘ ‘ నాపేరు రాహుల్ సావర్కార్ కాదు.. రాహుల్ గాంధీ.. నేను గానీ, మరే కాంగ్రెస్ వాది గానీ సారీ చెప్పే ప్రసక్తి లేదు ‘ అన్నారు. అటు. ప్రధాని మోదీ ఒంటిచేత్తో ఈ దేశ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేశారని రాహుల్ ఆరోపించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తే నల్లధనాన్ని అరికట్టవచ్చునంటూ ప్రజలను ఫూల్స్ ని చేశారని వ్యాఖ్యానించిన ఆయన.. ‘ ఇప్పుడేం జరిగింది ? బ్లాక్ మనీని అరికట్టేశారా ‘ అని ప్రశ్నించారు. మోదీ ‘ మేకిన్ ఇండియా ‘ అంటున్నారు.. కానీ ఈ రోజుల్లో ‘ రేప్ ఇన్ ఇండియా ‘ లా ఇది కనబడుతోంది ‘ అని రాహుల్ పేర్కొన్నారు. నిజానికి ఈ దేశ ఆర్ధిక పరిస్థితిని నాశనం చేసిన మోదీ, అమిత్ షాలే దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు. ఎవరైనా వార్తా పత్రిక చూస్తే.. అందులో ‘ మేకిన్ ఇండియా ‘ గురించిన వార్త ఏదైనా ఉందేమోనని అనుకుంటారని, కానీ పేపర్ ఓపెన్ చేయగానే.. ఎన్నో రేప్ కేసు తాలూకు వార్తలు కనబడుతాయని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అటు… రామ్ లీలా మైదానంలో జరిగిన సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు.
#WATCH: Rahul Gandhi,at ‘Bharat Bachao’ rally: I was told in Parliament by BJP y’day ‘Rahul ji, you gave a speech. Apologise for that.’ I was told to apologise for speaking something correct. My name is not Rahul Savarkar. My name is Rahul Gandhi. I will never apologise for truth pic.twitter.com/DhgFyZNX1a
— ANI (@ANI) December 14, 2019