పౌరసత్వ చట్టంపై సుప్రీం ముందుకు ఓవైసీ

జాతీయ పౌరసత్వ చట్టంలో మార్పులను మొదట్నించి వ్యతిరేకిస్తూ వస్తున్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దంగా వుందన్నది అసద్ వాదన. ఈమేరకు రూపొందించిన పిటీషన్‌ను శనివారం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడి, ఇక్కడే అక్రమంగా జీవిస్తున్న బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్ ప్రజలను భారత జాతీయులుగా గుర్తించడంతోపాటు.. ఈ గుర్తింపు నుంచి ముస్లింలను మినహాయించాలన్నది […]

పౌరసత్వ చట్టంపై సుప్రీం ముందుకు ఓవైసీ
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 14, 2019 | 6:47 PM

జాతీయ పౌరసత్వ చట్టంలో మార్పులను మొదట్నించి వ్యతిరేకిస్తూ వస్తున్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దంగా వుందన్నది అసద్ వాదన. ఈమేరకు రూపొందించిన పిటీషన్‌ను శనివారం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

దేశంలోకి అక్రమంగా చొరబడి, ఇక్కడే అక్రమంగా జీవిస్తున్న బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్ ప్రజలను భారత జాతీయులుగా గుర్తించడంతోపాటు.. ఈ గుర్తింపు నుంచి ముస్లింలను మినహాయించాలన్నది కేంద్రం తాజాగా తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన ఉద్దేశం. ముందుగా లోక్‌సభలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టినపుడు అసదుద్దీన్ తన సుదీర్ఘ ప్రసంగంతో వ్యతిరేకించారు.

అయితే.. లోక్‌సభలో మోదీ ప్రభుత్వానికి బంపర్ మెజారిటీ వుండడంతో పౌరసత్వ సవరణ బిల్లు ఈజీగానే నెగ్గింది. ఆ తర్వాత రాజ్యసభకు బిల్లు చేరినపుడు కొంతలో కొంత టెన్షన్ పడినా.. అక్కడా తమ మంత్రాంగంతో బిల్లును నెగ్గించుకున్నారు కమలనాథులు. ఈ క్రమంలో ఉభయసభలను దాటుకున్న పౌరసత్వ సవరణ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది.

ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల ముఖ్యంగా ఈశాన్య భారత రాష్ట్రాలలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదికొచ్చారు. దాంతో ఈశాన్యం రణరంగంగా మారింది. అయితే.. దేశంలోనికి అక్రమంగా వచ్చిన ముస్లింలలో ఎక్కువ మంది పాక్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలకు స్లీపర్ సెల్స్‌గా మారుతున్నందున వారిని మాత్రం మినహాయించి.. పొరుగు దేశాల నుంచి వచ్చిన హిందువులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు, బుద్దులను భారతీయులుగా గుర్తిస్తున్నామన్న సంగతిని ప్రచారం చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలో తాజా చట్టంపై న్యాయస్థానంలోనే తేల్చుకునేందుకు రెడీ అయ్యారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఈ మేరకు జాతీయ పౌరసత్వం చట్టంలో మార్పులను కొట్టివేయాలని కోరుతూ ఓవైసీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దంగా వుందన్నది అసద్ వాదన. ఈమేరకు రూపొందించిన పిటీషన్‌ను శనివారం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.