మరో దారుణం: చెల్లిని బెదిరించి.. అక్కపై అత్యాచారం..!

హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మాయమాటలు చెప్పి చెల్లి సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేసిన ఘటన భాగ్యనగరంలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8వ తేదీన చార్మినార్ వెళ్లేందుకు హష్మబాద్ వద్ద ఇద్దరు అక్కాచెల్లెలు ఆటో కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్నారు. ఇద్దరినీ చూసిన మహమ్మద్ అమీర్ అనే వ్యక్తి ఆటోతో అక్కడికి వచ్చాడు. దీంతో.. వారిద్దరూ ఆటోలో చార్మినార్‌తో పాటు జహంగీర్ పిల్లా దర్గాకు తీసుకెళ్లాలని చెప్పారు. అయితే.. సాయంత్రం […]

మరో దారుణం: చెల్లిని బెదిరించి.. అక్కపై అత్యాచారం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 14, 2019 | 7:01 PM

హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మాయమాటలు చెప్పి చెల్లి సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేసిన ఘటన భాగ్యనగరంలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8వ తేదీన చార్మినార్ వెళ్లేందుకు హష్మబాద్ వద్ద ఇద్దరు అక్కాచెల్లెలు ఆటో కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్నారు. ఇద్దరినీ చూసిన మహమ్మద్ అమీర్ అనే వ్యక్తి ఆటోతో అక్కడికి వచ్చాడు. దీంతో.. వారిద్దరూ ఆటోలో చార్మినార్‌తో పాటు జహంగీర్ పిల్లా దర్గాకు తీసుకెళ్లాలని చెప్పారు. అయితే.. సాయంత్రం సమయంలో దర్గాకు వెళ్లడం మంచిది కాదని మాయ మాటలు చెప్పి.. ఇంటికి తీసుకెళ్లాడు ఆటో డ్రైవర్ అమీర్.

కాగా.. వారిని చూసి ఇంటిలోని వారు నిలదీయడంతో.. నాంపల్లిలో దింపుతానని చెప్పి.. వారిద్దరినీ తన బండిమీద నాంపల్లి వరకు తీసుకెళ్లాడు అమీర్ తమ్ముడు మూసా. నాంపల్లిలోని హెటల్ గ్రాండ్‌లో ఓయో రూమ్‌కి అక్కాచెల్లెల్ని తీసుకెళ్లిన మూసా.. రూమ్‌లోకి వెళ్లిన తరువాత.. చెల్లెని చంపుతానని చెప్పి.. అక్కపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఇద్దరినీ ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌ వద్ద వదిలి పరారయ్యాడు.

అయితే.. 8వ తేదీన అక్కాచెల్లెలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. రైల్వే స్టేషన్‌లో వీరిని గుర్తుపట్టడంతో.. చంద్రాయణ గుట్ట పీఎస్‌కు సమాచారమిచ్చారు రైల్వే పోలీసులు. దీంతో.. తనపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలు తెలపడంతో.. విచారణ ప్రారంభించారు పోలీసులు. హోటల్‌కు వెళ్లి అడుగగా.. మూసా ఫేక్‌ ఐడీలు ఇచ్చినట్లు సమాచారం. కాగా.. అక్కడి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు.. అన్నదమ్ముల్ని అదుపులోకి తీసుకున్నారు.