North India Rains: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి.
ఉత్తరాఖండ్, బెంగాల్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి అనేక గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కరెంటు లేక వేలాది మంది చీకట్లలో మగ్గుతున్నారు. అనేక చోట్ల వరద నీరు రహదారులపైకి చేరడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. వరద నీటితో పాటు బురద కొట్టుకురావడం వల్ల తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు ప్రజలు. బెంగాల్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కోల్‌కతాలోని లేక్ గార్డెన్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల.. వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉత్తరాఖండ్ చమోలి జిల్లా పంగటి గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కార్మికుల తాత్కాలిక శిబిరాల పైకి బురద నీరు, బండరాళ్లు కొట్టుకొచ్చినట్లు తెలిపారు అధికారులు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు జిల్లా ఆఫీసర్లు. దీనిపై విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడారు సీఎం పుష్కర్‌సింగ్ ధామి. చమోలి జిల్లా వంటి రాష్ట్రంలోని అనేక ఒంటరి ప్రదేశాలలో భారీ వర్షాలు అతలాకుతలమయ్యాయి. నిజానికి, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించనప్పటికీ, క్లౌడ్‌బర్స్ట్ లాంటి ఎపిసోడ్‌ని జిల్లాలో చూసినట్లు అధికారులు తెలిపారు. అటు ఒడిశాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భువనేశ్వర్‌లోని డ్రైనేజీలో పడి 15 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. సైకిల్‌పై వెళ్తు.. వరదనీటిలో చిక్కుకుని ఆ మైనర్ అదృశ్యమైనట్లు తెలిపారు అధికారులు.
Weather forecast
రుతుపవన ద్రోణి ప్రభావంతో అల్పపీడనం విస్తరించింది. దక్షిణం దిశ నుంచి పశ్చిమ వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల, ఈ వారం ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రత్యేకించి, హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.
The Pangti village in the Chamoli district of #Uttarakhand was hit by a cloudburst at 5:30am today. Although no casualties were reported, several cars were stuck in the debris brought down by rainwater. #UttarakhandNews
Image source: TOI pic.twitter.com/Sfi8HadoqT
— The Weather Channel India (@weatherindia) September 20, 2021
Read Also… Panchamukha Hanuman: మంగళవారం రోజున పంచముఖ ఆంజనేయస్వామి ఏ విధంగా పూజిస్తే శుభఫలితాలు పొందుతారంటే..