రైతులకు మరో వరం.. గడువు లోగా రుణం చెల్లిస్తే 3 శాతం వడ్డీ తగ్గింపు.. వీడియో

రైతులకు మరో వరం.. గడువు లోగా రుణం చెల్లిస్తే 3 శాతం వడ్డీ తగ్గింపు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 21, 2021 | 7:57 AM

భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రధాని అయినప్పటినుంచీ ఆయన తీసుకునే చారిత్రక నిర్ణయాలు.. అమలు చేసే పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోంది.

భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రధాని అయినప్పటినుంచీ ఆయన తీసుకునే చారిత్రక నిర్ణయాలు.. అమలు చేసే పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోంది. ముఖ్యంగా అన్నదాతల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. రైతులకు సాయంగా ఖాతాలో డబ్బులు జమ చేయడమే కాకుండా ఇతర పథకాల ద్వారా ఆదాయం వచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న మరో వరం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు. ఈ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు 16 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులకు 14 లక్షల కోట్ల రుణాలను ఇచ్చింది. కేంద్ర సర్కార్‌ తన లక్షాన్ని చేరుకోవాలంటే మరో 2 లక్షల కోట్ల రుణాలను రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ప్రారంభించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ ఇల్లు చూస్తే అలా.. కరెంట్ బిల్లేమో ఇలా.. విశాఖ జిల్లాలో షాక్‌ కొడుతున్న విద్యుత్‌ బిల్లులు.. వీడియో

Andhra Pradesh: కానిస్టేబుల్‌తో భార్య అక్రమ సంబంధం.. అది తెలిసిన భర్త వీడియో తీసి..