AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: లేడీ కానిస్టేబుల్‌తో గుట్టుగా ఆ యవ్వారం.. భార్య ఎంట్రీతో బట్టబయలైన ఎస్‌ఐ బండారం.. చివరకు

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. భాగస్వాములు ఉండగానే మరొకరితో సంబంధాలు పెట్టుకుంటున్నారు జనాలు. తాజాగా ఇలాంటి ఘటనే నోయిడాలోనూ వెలుగు చూసింది. ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి.. ఏకంగా తన స్టేషన్‌ పనిచేస్తున్న కానిస్టేబుల్‌తోనే సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Watch Video: లేడీ కానిస్టేబుల్‌తో గుట్టుగా ఆ యవ్వారం.. భార్య ఎంట్రీతో బట్టబయలైన ఎస్‌ఐ బండారం.. చివరకు
Noida Si Affair
Noor Mohammed Shaik
| Edited By: Anand T|

Updated on: Oct 05, 2025 | 7:18 AM

Share

నోయిడాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై భార్య సంచలన ఆరోపణలు చేసింది. నోయిడాలో ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (SI) భార్య చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన భర్త ఓ మహిళా కానిస్టేబుల్‌తో గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, దీనిపై బిస్రఖ్ పోలీస్ స్టేషన్‌కి అధికారికంగా ఫిర్యాదు చేసినట్టు ప్రీతి శర్మ అనే మహిళ తెలిపింది. SI ప్రస్తుతం విధుల నుంచి సస్పెండ్‌లో ఉండగా ఈ వివాదం మరింత కలకలం సృష్టిస్తోంది.

Noida Si Affair

తన భర్త గతంలో నోయిడా ప్రాంతంలోని థానా ఫేజ్-1, సెక్టార్-24 పోలీస్ స్టేషన్లలో పని చేశాడని, విధుల్లో ఉండగానే మహిళా సహోద్యోగిని ప్రేమలోకి లాగాడని ప్రీతి ఆరోపించింది. రైడ్ పేరుతో వెళ్లిన భర్త వాస్తవానికి మహిళా కానిస్టేబుల్‌తో కలిసి ఉత్తరాఖండ్ టూర్‌కి వెళ్లాడని.. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు నాశనమవుతోందని ప్రీతి శర్మ ఆవేదన చెందుతోంది. తన భర్త ప్రవర్తనలో ఇటీవల చాలా మార్పులు వచ్చాయని, తనను మానసికంగా వేధించడం మొదలు పెట్టాడని పేర్కొంది.

ఇక ఇద్దరిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల నుంచి తొలగించాల్సిందేనని భార్య డిమాండ్ చేసింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదేలేదని ఆమె తేల్చి చెప్పింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో నోయిడా పోలీస్ విభాగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యవహారాలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో తగిన నైతికత లేకపోతే ప్రజల విశ్వాసానికి తీవ్ర దెబ్బ తగులుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. SI పై కఠినంగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

ఎస్‌ఐ భార్య ఆరోపణల

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ