Sabarimala: అయ్యప్ప భక్తులకు అలెర్ట్.. స్పాట్ బుకింగ్‌లపై శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం
కేరళలోని శబరిమలలో మండల పూజను పురస్కరించుకుని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అప్రమత్తమైంది. మకర జ్యోతి దర్శనానికి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మకరజ్యోతి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది
కేరళలోని శబరిమలలో మండల పూజను పురస్కరించుకుని అనూహ్యంగా ఏర్పడిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అప్రమత్తమైంది. మకర జ్యోతి దర్శనానికి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మకరజ్యోతి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రోజు రోజుకూ శబరిమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. మకరజ్యోతికి మహిళలు, చిన్నపిల్లలు రావొద్దని సూచించింది. ఇక మకరజ్యోతి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తారని.. అప్పుడు మరింత కష్టమవుతుందని అందుకే స్పాట్ బుకింగ్‌లను రద్దు చేస్తున్నామన్నారు. ఈనెల 14న 40 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. ఈనెల 15న మకర సంక్రాంతి రోజున కేవలం 50 వేల మందికి మాత్రమే బుకింగ్‌లు పరిమితం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనేక మంది భక్తులకు దర్శనానికి, వసతి ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సూచించింది. మకరజ్యోతి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌక్యరం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు శబరిమలకు భక్తులు పోటెత్తారు. అయ్యప్ప దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే ఈసారి శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. నవంబర్ 17 వ తేదీ నుంచి డిసెంబరు 27 వ తేదీ వరకూ 40 రోజుల్లోనే దాదాపు 32 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. దీంతో ఏకంగా రూ.241 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. గతేడాది కంటే రూ.18.72 కోట్లు అధికంగా వచ్చినట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఈ ఆదాయం లెక్కింపు పూర్తి కాలేదని.. మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశాయి.
శబరిమలలో భక్తుల రద్దీ..
@CMOKerala @TheKeralaPolice @BJP4Keralam In Sabarimala Devasthanam this time the crowd has gathered in large numbers and no proper action has been taken for that most of the devotees have faced great hardship as there is no toilet. Action should be taken #Kerala #sabarimalai pic.twitter.com/hBUYcK7DL3
— தயா (Social Worker) (@PresidencyDhaya) January 3, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..