AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agnipath Scheme: వెనక్కి తగ్గేదే లే.. ఆ నిరసనకారులను చేర్చుకోం.. తేల్చి చెప్పిన త్రివిధ దళాధిపతులు..

విధ్వంసాలకు పాల్పడినవారికి ఇకపై ఆర్మీలో చేరే అవకాశమే లేదు. ఆందోళనల్లో పాల్గొన్నవారి ఫొటోలు గుర్తిస్తామని, వాళ్లందరికీ ఉద్యోగాలు ఇవ్వబోవడం లేదని తేల్చేశారు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి.

Agnipath Scheme: వెనక్కి తగ్గేదే లే.. ఆ నిరసనకారులను చేర్చుకోం.. తేల్చి చెప్పిన త్రివిధ దళాధిపతులు..
Lt General Anil Puri
Sanjay Kasula
|

Updated on: Jun 19, 2022 | 5:11 PM

Share

త్రివిధ దళాల్లో ఇక నుంచి సైనికుల రిక్రూట్‌మెంట్‌ పాతపద్ధతిలో ఉండదని ఆర్మీ అధికారులు కుండబద్దలు కొట్టారు. ఇక నుంచి జవాన్ల రిక్రూట్‌మెంట్లన్నీ అగ్నిపథ్‌ విధానంలోనే ఉంటాయని సైనికాధికారి అనిల్‌పురి చెప్పారు. TV9 భారత్‌వర్ష్‌ ప్రతినిధి అడిగిన ఈ ప్రశ్నకు అనిల్‌ పురి ఈ సమాధానం చెప్పారు. విధ్వంసానికి పాల్పడిన వారికి త్రివిధ దళాల్లో చోటు ఉండదని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. విధ్వంసానికి పాల్పడిన వారిని చాలా ఈజీగా గుర్తించగలమని ప్రకటించాయి. సైనిక దళాల్లో చేరేవారికి క్రమశిక్షణ ముఖ్యమని, అది లేని వాళ్లకు సైన్యంలో స్థానం ఉండదని తెలిపారు. సైనిక దళాల్లో చేరేందుకు వచ్చేవారు తాము ఏ ఆందోళనలో పాల్గొనలేదని ఒక అండర్‌ టేకింగ్‌ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. విధ్వంసంలో పాల్గొన్నట్టు ఎవరిపైనైనా FIR నమోదు అయి ఉంటే వారిని చేర్చుకోమని సైనికాధికారులు స్పష్టం చేశారు.

ఈ పథకాన్ని ‘విశ్లేషణ’ చేసేందుకు 46,000 మంది ఆర్మీ ఔత్సాహికుల నియామించి.. ఆ తర్వాత కేంద్రం ఈ  పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకానికి వెనక్కి తగ్గేది లేదన్నారు.

 “భారత సైన్యానికి క్రమశిక్షణ పునాది. కాల్పులకు, విధ్వంసానికి ఆర్మీలో చోటు లేదు. ప్రతి వ్యక్తి తాము నిరసన లేదా విధ్వంసంలో భాగం కాదని సర్టిఫికేట్ ఇస్తారు. పోలీసు వెరిఫికేషన్ 100% ఉంటుంది. అది లేకుండా ఎవరూ చేరలేరు.” అని బ్రీఫింగ్ సందర్భంగా అతను చెప్పాడు.