జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్)పై కేంద్రం కీలక ప్రకటన
ఓ వైపు సీఏఏ, ఎన్నార్సీలపై ఆందోళనలు జరుగుతున్న వేళ.. కేంద్రం ఎన్‌పీఆర్‌పై కీలక ప్రకటన చేసింది. జాతీయ జనాభా పట్టికను అప్డేట్ చేయడం కోసం.. ఎలాంటి డాక్యుమెంట్లు అడగబోమని.. బయోమెట్రిక్‌తో కూడా ఎలాంటి వివరాలు తీసుకోమంటూ.. కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. గతకొద్ది రోజులుగా ఈ జాతీయ జనాభా పట్టిక విషయమై.. వెస్ట్ బెంగాల్, అసోం వంటి రాష్ట్రాలతో పాటుగా విపక్షాలు దీనిపై అభ్యంతరాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ బుధవారం ఈ […]

ఓ వైపు సీఏఏ, ఎన్నార్సీలపై ఆందోళనలు జరుగుతున్న వేళ.. కేంద్రం ఎన్‌పీఆర్‌పై కీలక ప్రకటన చేసింది. జాతీయ జనాభా పట్టికను అప్డేట్ చేయడం కోసం.. ఎలాంటి డాక్యుమెంట్లు అడగబోమని.. బయోమెట్రిక్‌తో కూడా ఎలాంటి వివరాలు తీసుకోమంటూ.. కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. గతకొద్ది రోజులుగా ఈ జాతీయ జనాభా పట్టిక విషయమై.. వెస్ట్ బెంగాల్, అసోం వంటి రాష్ట్రాలతో పాటుగా విపక్షాలు దీనిపై అభ్యంతరాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ బుధవారం ఈ కీలక ప్రకటన చేసింది.
ఎన్‌పీఆర్ ప్రక్రియ అప్డేట్ నిమిత్తం.. కొన్ని ప్రశ్నలతో కూడిన పత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. అయితే.. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫీస్ వెబ్‌సైట్లో ఉన్న సమాచారం ప్రకారం.. వ్యక్తి పేరు, వయసు, జాతీయత వంటి వివరాలతోపాటు.. బయోమెట్రిక్ వివరాలను ఈ ఎన్‌పీఆర్ డేటాబేస్ కలిగి ఉంటుంది. ‘దేశంలో నివసిస్తున్న వ్యక్తుల పూర్తి సమాచారం రూపొందించడమే ఈ ఎన్‌పీఆర్ ముఖ్య ఉద్దేశమని.. అందులో ప్రజల వివరాలతోపాటుగా సదరు వ్యక్తి బయోమెట్రిక్ వివరాలు కూడా ఉంటాయ’ని ఆ వెబ్‌సైట్ పేర్కొంటుంది.
కాగా, అసోం మినహా.. మిగతా అన్ని రాష్ట్రాలతో పాటు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో 2020 ఏప్రిల్-సెప్టెంబర్ మాసాల్లో ఈ ఎన్‌పీఆర్ ప్రక్రియను నిర్వహించనుంది.