దేశంలో ఇస్లాం ప్రమాదకర పరిస్థితుల్లో లేదు.. ముస్లిములు భయపడరాదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఇండియాలో ఇస్లాం ప్రమాదకర పరిస్థితుల్లో లేదని,ఇలా ఉన్నట్ట్టు ముస్లింలు భయపడరాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆయన చెప్పారు.
ఇండియాలో ఇస్లాం ప్రమాదకర పరిస్థితుల్లో లేదని,ఇలా ఉన్నట్ట్టు ముస్లింలు భయపడరాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆయన చెప్పారు. ‘హిందుస్తానీ ఫస్ట్..హిందుస్తాన్ ఫస్ట్’ అన్న అంశంపై ముస్లిం రాష్ట్రీయ మంచ్ నిన్న ఘజియాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..ప్రజలు ఎలా పూజిస్తారన్నదానిపై వారిని వేరు చేసి చూడరాదని చెప్పారు. మూకుమ్మడి దాడులు హిందూత్వకు వ్యతిరేకమని, కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులపై ‘లించింగ్’ కేసులు నమోదవుతున్నాయని ఆయన అన్నారు. ఏమైనా ఈ లించింగ్ అన్నది హిందూత్వకు వ్యతిరేకమని గట్టిగా చెబుతున్నా అని పేర్కొన్నారు. దేశంలో వివిధ వర్గాల మధ్య ఐక్యత ఉంటేనే అభివృద్ధి సాద్యమని ఆయన అభిప్రాయపడ్డాయారు. హిందూ-ముస్లిముల మధ్య విద్వేషాలు ఉండరాదని..వారి మధ్య సానుకూల చర్చలే ప్రామాణికంగా ఉండాలని మోహన్ భగవత్ సూచించారు. హిందూ-ముస్లింల మధ్య ఐక్యత అన్న పదమే తప్పుదారి పట్టించేదిగా ఉందని..నిజానికి భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని పునరుద్ఘాటించారు. అది ఏ మతం వారైనా సరే అని ఆయన పేర్కొన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నేనిక్కడికి రాలేదు.. మా సంస్థకు రాజకీయాలతో సంబంధం లేదు.. ఇమేజ్ కోసం మేం పాకులాడడం లేదు అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. దేశాన్ని బలోపేతం చేయడానికి, సమాజ సంక్షేమం కోసమే తమ సంస్థ కృషి చేస్తుందని ఆయన చెప్పారు. అయితే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. ఓ ప్రకటనలో ….గాడ్సే హిందుత్వ ఐడియాలజీ ఫలితంగానే ముస్లిముల లించింగ్ ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇప్పటికీ ఆ ఐడియాలజీ దేశంలో కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. యూపీ వంటి రాష్ట్రాల్లో ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
మరిన్ని ఇక్కడ చూడండి: India Corona Cases: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా ప్రభావం.. 30వేలకు పడిపోయిన పాజిటివ్ కేసులు..