ఇక …ల్యాండ్, లిక్విడిటీ అండ్ లా ..నిర్మలా సీతారామన్

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా ఇప్పటివరకు వివిధ రంగాలకు నాలుగు విడతలుగా వరాలను ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆదివారం ఐదో విడత ప్యాకేజీ గురించి వివరించారు.

ఇక  ...ల్యాండ్, లిక్విడిటీ అండ్ లా ..నిర్మలా సీతారామన్

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా ఇప్పటివరకు వివిధ రంగాలకు నాలుగు విడతలుగా వరాలను ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆదివారం ఐదో విడత ప్యాకేజీ గురించి వివరించారు. గ్రామీణఉపాధి హామీ పథకం, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పీ ఎస్ యు రిలేటెడ్ పాలసీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి  సంబంధిత వనరులను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. నిర్మల ప్రకటించిన ప్రధాన అంశాల్లో కొన్ని..

వలస కార్మికులకు సంబంధించి శ్రామిక్ రైళ్ల టికెట్లను 85 శాతం కేంద్రమే భరించింది

8.1 కోట్ల మంది రైతులకు కిసాన్ యోజన కింద 16,394 కోట్ల రుణాలు

ఉజ్వల యోజన కింద 6.8 కోట్ల మంది పేదలకు ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ

జన్ ధన్ యోజన కింద 20 కోట్ల మంది మహిళలకు వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా సొమ్ము బదిలీ

హెల్త్ కేర్ కోసం రాష్ట్రాలకు 4,100 కోట్లు

బిల్డింగ్, కన్ స్ట్రక్షన్ కోసం 3,950 కోట్లు

పీ ఎం ఈ-విద్యా ప్రోగ్రామ్ అమలు

ఈ-పాఠశాల కోసం 200 బుక్స్

డిజిటల్..ఆన్ లైన్ ఎడ్యుకేషన్

ఈ నెల 30 నుంచి టాప్ 100 యూనివర్సిటీల్లో ఇక ఆన్ లైన్ కోర్సులు

ఆన్ లైన్ ఎడ్యుకేషన్ లో రేడియో, ‘పోడ్ కాస్ట్’ వినియోగం

బ్లాక్ స్థాయిలో పబ్లిక్ హెల్త్ సెటప్

ఎంఎన్ ఆర్ ఈ జీ ఏ స్కీమ్ కి అదనంగా రూ. 40 వేల కోట్ల వ్యయం

ప్రతి జిల్లా బ్లాకులో హెల్త్ వెల్ సెంటర్లు

పట్టణ,  గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సెంటర్లు

అన్ని జిల్లాల్లో అంటువ్యాధుల నివారణ హాస్పిటల్ బ్లాకులు

సర్వే లెన్స్ నెట్ వర్క్ ల పటిష్ఠత

నేషనల్ హెల్త్.. డిజిటల్ హెల్త్ బ్లూ ప్రింట్ అమలు

అన్ని రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం

కోవిడ్-19 అదుపునకు రూ. 15 వేల కోట్లు

కరోనా నేపథ్యం.. ప్రతి వ్యక్తికీ రూ. 50 లక్షల ఇన్సూరెన్స్

టెస్టింగ్ ల్యాబ్స్, కిట్స్ కోసం రూ. 550 కోట్లు

ఈ-సంజీవని టెలి కన్సల్టేషన్ సర్వీసులు

ఎపిడమిక్ వ్యాధుల చట్టానికి సవరణ

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా వివిధ వర్గాలకు డీబీటీతో నగదు బదిలీ

భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో రూ. 3,955 కోట్లు జమ

ఒకటో తరగతి నుంచి 12 వరకు ప్రతి క్లాసుకీ ఓ ఛానల్

బధిరుల కోసం స్పెషల్ ఛానెల్

వైద్య పరిశోధనల కోసం ఐసీఎంఆర్ ద్వారా అదనపు నిధులు

 

 

 

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu