దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచాపై పూర్తి నిషేధం

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తమైంది. దీపావళి బాణాసంచాతో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు దేశంలో పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచాపై పూర్తి నిషేధం
Follow us

|

Updated on: Nov 09, 2020 | 2:54 PM

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తమైంది. దీపావళి బాణాసంచాతో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు దేశంలో పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో నవంబరు 9 అర్ధరాత్రి నుంచి నవంబరు 30 వరకు అన్ని రకాల బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ సంపూర్ణ నిషేధం విధించింది. అంతేగాక, నవంబరులో గతేడాది కంటే గాలి నాణ్యత తక్కువగా ఉండే దేశంలోని ఇతర నగరాలు, ప్రాంతాలకు కూడా ఇవే ఆదేశాలు వర్తిస్తాయని ట్రిబ్యునల్ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ట్రైబ్యూనల్‌లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిని ట్రిబ్యునల్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఇక, గాలి నాణ్యత సాధారణంగా ఉండే ప్రాంతాల్లో కేవలం హరిత టపాసులను మాత్రమే విక్రయించాలని వెల్లడించింది. దీపావళి, క్రిస్మస్‌, న్యూఇయర్ వేడుకల్లో బాణసంచా పేల్చుకోవడానికి కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. కాలుష్యంతో కొవిడ్‌-19 వైరస్‌ మరింత వ్యాప్తిచెందే ప్రమాదం ఉన్నందున వాయు కాలుష్య నియంత్రణకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దారుణ స్థితికి పడిపోయిందని, హరిత టపాసులు కూడా శ్రేయస్కరం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దేశ రాజధానిలో అన్ని రకాల టపాసులపై నిషేధం విధించింది. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని చోట్ల హరిత టపాసులకు అయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి.

త్రిముఖ పోరులో సత్తా చాటిన కాంగ్రెస్
త్రిముఖ పోరులో సత్తా చాటిన కాంగ్రెస్
IPL 2024 Auction: తొలిసారి విదేశాల్లో ఐపీఎల్ వేలం.. ఎప్పుడంటే?
IPL 2024 Auction: తొలిసారి విదేశాల్లో ఐపీఎల్ వేలం.. ఎప్పుడంటే?
కోరిన కోర్కెలు తీరడానికి రోజు సూర్యుడికి ఇలా అర్ఘ్యం సమర్పించండి
కోరిన కోర్కెలు తీరడానికి రోజు సూర్యుడికి ఇలా అర్ఘ్యం సమర్పించండి
'మీలాంటి నాయకుడిని చూడలేదు'.. కేటీఆర్‌కు అనసూయ, ఆర్జీవీ మద్దతు
'మీలాంటి నాయకుడిని చూడలేదు'.. కేటీఆర్‌కు అనసూయ, ఆర్జీవీ మద్దతు
ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
PKL 2023: భారీ ఆశలు.. కట్‌చేస్తే.. తొలి మ్యాచ్‌లోనే ఘోర వైఫల్యం
PKL 2023: భారీ ఆశలు.. కట్‌చేస్తే.. తొలి మ్యాచ్‌లోనే ఘోర వైఫల్యం
తెలంగాణలో మారిన బలాబలాలు.. జోన్ల వారీగా లెక్కలు ఇవే!
తెలంగాణలో మారిన బలాబలాలు.. జోన్ల వారీగా లెక్కలు ఇవే!
'ఎక్స్‎ట్రా ఆర్టినరీ' అమ్మాయి మనసులు దొచేస్తుంది..
'ఎక్స్‎ట్రా ఆర్టినరీ' అమ్మాయి మనసులు దొచేస్తుంది..
హిమపాతాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
హిమపాతాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఏమన్నారంటే?
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఏమన్నారంటే?
ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణం : కేటీఆర్
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
రూ.3 కోట్లు ఇస్తారా కేసు పెట్టమంటారా? మైక్ టైసన్‌ కొత్త తలనొప్పి.
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
అమెరికాను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.!
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
నాన్నా ప్రేమగా మాట్లాడడు., అమ్మ నాతో ఆడుకోదు.. 4 ఏళ్ల చిన్నారి..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఫీజు ఇవ్వాల్సి వస్తుందని సొంతం వైద్యం చేస్తే ఇలానే ఉంటది..
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ఒక్క ఉత్తరమే సొరంగంలో వాళ్ల ప్రాణాలు కాపాడిందా.?
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తాం.. రేవంత్ రెడ్డి
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
ఒకేరోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమాన ప్రమాదాలు !!
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్
భారీ ఆధిక్యంలో కాంగ్రెస్.. ర్యాలీ‌తో గాంధీభవన్‌కు రేవంత్