క్షీణించిన లాలూప్రసాద్ ఆరోగ్యం
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహాగడ్బంధన్‌కు మంచి ఛాన్స్ ఉందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఇంకా టెన్షన్ పడుతున్నట్టుగా ఉంది..రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని డాక్టర్లు అంటున్నారు.. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించిందని చెబుతున్నారు.. ప్రస్తుతం లాలూకు డయాలసిస్ కొనసాగుతున్నదని వివరించారు. దాణా స్కామ్ కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ 2017 నుంచి జైలులోనే ఉన్నారు.. […]

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహాగడ్బంధన్‌కు మంచి ఛాన్స్ ఉందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఇంకా టెన్షన్ పడుతున్నట్టుగా ఉంది..రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని డాక్టర్లు అంటున్నారు.. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించిందని చెబుతున్నారు.. ప్రస్తుతం లాలూకు డయాలసిస్ కొనసాగుతున్నదని వివరించారు. దాణా స్కామ్ కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ 2017 నుంచి జైలులోనే ఉన్నారు.. అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. లాలుకు కిడ్నీ సమస్యలు ఉన్నాయి.. అయినా ఇప్పటి వరకు డయాలసిస్ చేయాల్సిన అవసరం రాలేదని, కాని ఇప్పుడు చేస్తున్నామని డాక్టర్లు అంటున్నారు. లాలూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడమన్నది గత నాలుగు దశాబ్దాలలో ఇదే మొదలు.