Actor : నాతో సౌందర్య స్పెషల్ సాంగ్.. ఆ సినిమా ఏకంగా 365 రోజులు ఆడింది.. ఇప్పటికీ సంచలనమే.. టాలీవుడ్ నటుడు..
దివంగత హీరోయిన్ సౌందర్య.. ఇప్పటికీ సినీప్రియుల హృదయాల్లో చెరగని అద్భుత రూపం. అందం, అభినయంతోపాటు అందమైన వ్యక్తిత్వంతో కోట్లాది మంది మనసులలో స్థానం సంపాదించుకుంది. దక్షిణాదిలో అగ్ర కథానాయకులతో నటించి తనదైన ముద్ర వేసింది. తాజాగా ఓ నటుడు సౌందర్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

టాలీవుడ్ హాస్యనటుడు బాబు మోహన్ మాయలోడు సినిమా, అందులోని తన పాట సాధించిన అపూర్వ విజయం, అలాగే దివంగత నటి సౌందర్య సినీ రంగ ప్రవేశం వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను వివరించారు. తన సినీ కెరీర్‌లో 99% సినిమాలు తాను చూడలేదని చెప్పిన బాబు మోహన్, మాయలోడు సినిమాలోని ఒక పాట మాత్రం తనకు ఎంతో ప్రత్యేకమని, అది 365 రోజులు ఆడిందనే వార్త విని ఆశ్చర్యపోయానని తెలిపారు. ఒకానొక రోజు వేరే షూటింగ్ నిమిత్తం సారధి స్టూడియోలో ఉండగా, మాయలోడు సినిమా 365వ రోజు ఆడుతుందని, థియేటర్ వద్ద పెద్ద కటౌట్, సౌందర్యతో కలిసి తన చిత్రం కూడా ఉందని తెలిసి, స్వయంగా వెళ్లి చూశానని బాబు మోహన్ చెప్పారు. థియేటర్ వద్ద హౌస్‌ఫుల్ బోర్డు చూసి, 365 రోజులు ఆడుతున్న సినిమాకు హౌస్‌ఫుల్ ఎలా అని మేనేజర్‌ను ప్రశ్నించగా, మేనేజర్ చెప్పిన విషయం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‌లో సంచలనంగా మారింది..
ప్రేక్షకులు సుమారు 100 రోజుల నుండి ప్రతిరోజు ఉదయం టికెట్లు కొనుక్కుని, పాట వేసే సమయానికి వచ్చి, పాట చూసి వెళ్లిపోతుంటారని, లోపల కూర్చున్నవాళ్లు మాత్రమే సినిమా చూస్తారని మేనేజర్ వివరించారు. డాన్సర్ కాకపోయినా తాను నటించిన పాట అంత పెద్ద హిట్ అవ్వడం, ఇప్పటికీ పిల్లలు స్కూల్ డేస్‌లో ఆ పాటకు డ్యాన్స్ చేయడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని బాబు మోహన్ పేర్కొన్నారు.
మనవరాలి పెళ్లి సినిమా కోసం కోడి రామకృష్ణ , శ్యామ్ బాబు క్యూట్‌గా ఉండే అమ్మాయి కోసం వెతుకుతున్నారని తెలిసి, తాను సౌందర్యను చూడగానే ఈ అమ్మాయి భలే ఉంటుంది, ఇన్నోసెంట్ క్యారెక్టర్‌కు సరిపోతుంది, ముద్దుగా ఉంది అని భావించి, రెండు స్నాప్స్ తీసి స్వయంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట్లో ఇచ్చి వచ్చానని తెలిపారు. తిరుపతిలో మనవరాలి పెళ్లి షూటింగ్ జరుగుతుండగా, హరీష్ హీరోగా, తాను, కోట శ్రీనివాసరావు తండ్రీ కొడుకులుగా నటించిన ఆ సినిమాకు సౌందర్య ఎంపికయ్యారని అన్నారు. అయితే, మనవరాలి పెళ్లి సరిగా ఆడకపోయినప్పటికీ, ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఆమె అమ్మోరు చిత్రానికి సెలక్ట్ అయ్యారని బాబు మోహన్ వెల్లడించారు. అమ్మోరు సినిమా ముందు రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సౌందర్య స్టార్ హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు సినిమాలు విడుదలయ్యాయి. మాయలోడు కంటే ముందు సౌందర్య స్టార్ కాదని, ఆ సినిమా తర్వాతే ఆమె ఒక సూపర్ హీరోయిన్ అయ్యారని బాబు మోహన్ అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

Babu Mohan, Soundarya
ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..
