AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Sales: ఐఫోన్ ధరకే లగ్జరీ కార్లు.. అద్దిరిపోయే ఫీచర్లు.. ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే

సెకండ్ హ్యాండ్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది సొంతంగా కార్లు, బైకులలో తిరిగేందుకే ఇష్టపడుతున్నారు. మరి అలాంటివారి కోసం హైదరాబాద్‌లో కేవలం ఐఫోన్ ధరకే అద్భుతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. అదెక్కడో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా..

Car Sales: ఐఫోన్ ధరకే లగ్జరీ కార్లు.. అద్దిరిపోయే ఫీచర్లు.. ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే
Cars Sale
Ravi Kiran
|

Updated on: Feb 13, 2026 | 4:33 PM

Share

హైదరాబాద్‌లో షూరూమ్ కార్లకే కాదు.. సెకండ్ హ్యాండ్ కార్లు కూడా ఎక్కువగానే దొరుకుతాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు.. బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లలో కార్లు ఇక్కడ దొరుకుతాయి. కేవలం రూ. 1.5 లక్షల నుంచి ప్రారంభమయ్యే ధరలతో మారుతి స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, హ్యుందాయ్ ఐ20 మోడళ్లు మీ సొంతం చేసుకోవచ్చు. 2012 మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ విషయానికొస్తే.. ఇది కేవలం 44,000 కిలోమీటర్లు మాత్రమే నడిచింది. అలాగే 18-20 కి.మీ.ల మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ వెర్షన్ అయిన దీనికి CNG కిట్‌ను కూడా అమర్చుకోవచ్చు. దీని ధర రూ. 1.5 లక్షల నుంచి రూ. 1.7 లక్షల మధ్య ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో కారు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అలాగే 2014 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VXI పెట్రోల్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. దీని మైలేజ్ 16-18 కి.మీ.ల మధ్య ఉంటుంది. ఈ కారు నాలుగు పవర్ విండోలు, ఇన్-బిల్ట్ స్టీరియో, ఎయిర్ కండిషనర్, మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లతో వస్తోంది. దీని ధర సుమారు రూ. 3.7 లక్షల నుంచి రూ. 3.8 లక్షల మధ్య ఉంటుంది.

డీజిల్ వాహనాల విషయానికొస్తే.. 2016 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వెహికల్ ఉంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 20 కి.మీ.ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మిర్రర్‌లు, నాలుగు పవర్ విండోలు, ఇన్-బిల్ట్ స్టీరియో, ఏసీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని సర్వీసింగ్ ఖర్చు రూ. 5 వేల నుంచి రూ. 10 వేల మధ్య ఉంటుంది. బ్రిడ్జ్‌స్టోన్ టైర్స్‌తో సహా టైర్ కండిషన్ 70-80 శాతం వరకు బాగుంది. దీని ధర సుమారు రూ. 4.9 లక్షలు. 2017 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వెహికల్ కూడా అందుబాటులో ఉంది. ఇది 78,000 కిలోమీటర్లు నడిచి, సుమారు 20 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. నాలుగు పవర్ విండోలు, పవర్ స్టీరింగ్, ఏసీ లాంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర దాదాపు రూ. 5 లక్షలు.

హ్యుందాయ్ బ్రాండ్‌లో, గ్రాండ్ ఐ10, ఐ20 మోడళ్లు కూడా అందుబాటు ధరల్లో ఉన్నాయి. 2014 మోడల్ గ్రాండ్ ఐ10 ఆస్ట్రా(పెట్రోల్, టాప్ ఎండ్) ఎయిర్‌బ్యాగ్, ఇన్-బిల్ట్ స్టీరియో, అల్లాయ్ వీల్స్, ఏబీఎస్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లాంటి ఫీచర్లతో వస్తుంది. దీని ధర రూ. 3.5 లక్షల నుంచి రూ. 3.6 లక్షల మధ్య ఉంటుంది. 2017 మోడల్ గ్రాండ్ ఐ10 ఆస్ట్రా(డీజిల్) అయితే ఎయిర్‌బ్యాగ్స్, అల్లాయ్ వీల్స్, టచ్ స్క్రీన్, పుష్ స్టార్ట్ బటన్ లాంటి అధునాతన ఫీచర్లతో వస్తోంది. ఇది 70,000 కిలోమీటర్లు నడిచి, 20-22 కి.మీ. మైలేజ్ ఇస్తుంది, దీని ధర రూ. 4.5 లక్షల నుంచి రూ. 4.6 లక్షల మధ్య ఉంది. కాగా, ఇది హైదరాబాద్ కార్స్ 24 బ్రాంచులు, ఆన్‌లైన్ ద్వారా మీరు చూడొచ్చు.

Follow Us