News9 Global Summit: భారత్ – జర్మనీ మైత్రి మరింత ముందుకు.. కీలకంగా మారనున్న న్యూస్9 గ్లోబల్‌ సమ్మిట్‌

వాణిజ్య, సాంస్కృతిక, సాంకేతిక సహకారం కారణంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా - జర్మనీల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాంప్రదాయకంగా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించే న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌ ఈ సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు దోహదపడనుంది..

News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు.. కీలకంగా మారనున్న న్యూస్9 గ్లోబల్‌ సమ్మిట్‌
News9 Global Summit
Follow us
Shaik Madar Saheb

| Edited By: TV9 Telugu

Updated on: Nov 20, 2024 | 5:49 PM

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ నవంబర్ 21 నుంచి 23 వరకు జరగనుంది. టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరిగే భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ జర్మనీలోని స్టుట్‌గార్ట్ వేదికగా MHP అరేనా స్టేడియంలో జరగనుంది. TV9 నెట్‌వర్క్‌ ఎండీ, సీఈఓ బరుణ్‌ దాస్‌ అధ్యక్షతన జరిగే మూడు రోజుల న్యూస్9 భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో భారత్ – జర్మనీ దేశాల మధ్య మైత్రీ, వాణిజ్య సంబంధాలు, భాగస్వామ్యంపై కీలక చర్చ జరగబోతుంది. ఇండియా – జర్మనీ సుస్థిర అభివృద్ధి కోసం నూతన ఆవిష్కరణలు, ఉద్యోగ -ఉపాధి తదిర అంశాలపై కీలక చర్చ జరగబోతోంది.. ఈ సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, అలాగే జర్మనీ మంత్రులు, ప్రతినిధులు పాల్గొననున్నారు. వారితో పాటు పలువురు రాజకీయ, వాణిజ్య, క్రీడా, సినీ ప్రముఖులు చర్చలో పాల్గొని అభిప్రాయాలను పంచుకోనున్నారు.

TV9 నెట్‌వర్క్ ఫ్లాగ్‌షిప్ కాన్క్లేవ్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ విజయవంతం అయిన తర్వాత నెట్‌వర్క్ న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్‌ ముఖ్యంగా.. భారతదేశం, జర్మనీ మధ్య సంబంధాలు మరింత బలోపేతానికి దోహదం కానుంది.. గత కొన్నేళ్లుగా భారత్, జర్మనీ మధ్య దౌత్య సంబంధాలు, ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతూ వస్తున్నాయి.. వాస్తవానికి యూరప్ లో జర్మనీ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారు (FDI) జర్మనీనే. గత కొన్నేళ్లుగా జర్మనీలో భారతీయ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి..

ఇప్పటికే.. వాణిజ్య, సాంస్కృతిక, సాంకేతిక సహకారం కారణంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా – జర్మనీల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాంప్రదాయకంగా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించే న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌ ఈ సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు దోహదపడనుంది..

ప్రజాస్వామ్య దేశాలైన భారత్, జర్మనీ.. మానవ గౌరవాన్ని కాపాడడంలో… భాగస్వామ్య విలువల ఆధారంగా మెరుగైన భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.. దీంతోపాటు.. ప్రపంచ రాజకీయాల్లో సైతం కీలకంగా వ్యవహరిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో భారత్ – జర్మనీ గ్లోబల్ సమ్మిట్ కీలకంగా మారనుంది.

అన్ని విషయాల్లో భారత్, జర్మనీ ఒకదానితో ఒకటి ఏకీభవించనప్పటికీ, అర్థవంతమైన భాగస్వామ్యాలను నిర్మించవచ్చని.. ఈ నేపథ్యంలో టీవీ9 సమ్మిట్ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ మూడు రోజుల కార్యక్రమాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల