Bulldozer Justice: నిందితుల ఇళ్లను కూల్చడం హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నేరాలకు పాల్పడిన వ్యక్తులపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించింది. ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కును కాలరాయడమే అంటూ సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

Bulldozer Justice: నిందితుల ఇళ్లను కూల్చడం హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Bulldozer Justice
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 13, 2024 | 11:44 AM

బుల్డోజర్‌ జస్టిస్‌పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.. నిందితుల ఇళ్లను కూల్చడం చట్ట విరుద్ధమని.. ఇళ్లను కూల్చడం అంటే నివసించే హక్కును కాలరాయడమే అంటూ సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. పలు కేసుల్లో ఉన్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని.. నిష్పాక్షిక విచారణ పూర్తికాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమంటూ పేర్కొంది..దోషిగా నిర్థారించినా చట్ట ప్రకారమే శిక్ష ఉంటుందని స్పష్టంచేసింది. న్యాయవ్యవస్థ స్థానాన్ని పాలనావ్యవస్థ భర్తీ చేయలేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.. అధికారులే కోర్టుల పాత్ర పోషించడం సరికాదని చెప్పింది.. కార్యనిర్వాహక అధికారి ఒక వ్యక్తిని దోషిగా నిర్థారించలేరని, అందుకు కోర్టుకు ఉన్నాయని సర్వోన్నత ధర్మాసనం గుర్తు చేసింది..

ఈ బుల్డోజర్‌ జస్టిస్‌ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. చట్టాన్ని, నిబంధనలను అతిక్రమించి నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చేస్తే కనుక.. ఆ కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సిందేనని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఇకపై కుదరవని తేల్చి చెప్పింది.. మతానికి, కూల్చివేతలకు కూడా లింక్‌ పెట్టొద్దని కూడా ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఆదేశం ఏ ఒక్క రాష్ట్రానికో కాదని.. యావత్ దేశానికో సంబంధించినదని సుప్రీంకోర్టు పేర్కొంది.. కేవలం క్రిమినల్ కేసులో నిందితుడు లేదా నిందితుడు అనే కారణంతో ఎవరైనా ఇంటిని కూల్చివేయలేమని కోర్టు పేర్కొంది. అటువంటి పరిస్థితిలో అధికారులు చట్టాన్ని విస్మరించరాదని.. బుల్డోజర్ చర్య అంటే ప్రాథమిక హక్కులను కాలరాయడమేనంటూ పేర్కొంది.

నేరాలకు పాల్పడిన వ్యక్తులపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించింది. అనేక రాష్ట్రాల్లో ఈ ట్రెండ్‌ను ‘బుల్‌డోజర్‌ న్యాయం’గా పేర్కొంటారు. ఇలాంటి సందర్భాల్లో అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశారని రాష్ట్ర అధికారులు గతంలో చెప్పిన సందర్భాలున్నాయి.. దీనిపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనేది ఒక కల అని.. జాస్వామ్య ప్రభుత్వానికి చట్టబద్ధమైన పాలన పునాది. ఈ సమస్య నేర న్యాయ వ్యవస్థలో న్యాయానికి సంబంధించినది.. చట్టపరమైన ప్రక్రియ నిందితుల నేరాన్ని ముందస్తుగా నిర్ధారించకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..