AADHAR: ఆధార్ కార్డు జారీలో కొత్త రూల్స్.. నకిలీ కార్డుల కట్టడికి చర్యలు.. ఎప్పటినుంచి అంటే

దేశంలో ఓ వ్యక్తి గుర్తింపునకు ఆధార్ కార్డు కీలకంగా పనిచేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ఆధార్ కార్డు కూడా ఓ నిత్యావసరంగానే మారింది. మనం ఎటువంటి ప్రభుత్వ సేవలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రయివేటు సంస్థలు సైతం వ్యక్తి గుర్తింపు కోసం..

AADHAR: ఆధార్ కార్డు జారీలో కొత్త రూల్స్.. నకిలీ కార్డుల కట్టడికి చర్యలు.. ఎప్పటినుంచి అంటే
Aadhaar Correction
Follow us

|

Updated on: Sep 23, 2022 | 3:32 PM

AADHAR: దేశంలో ఓ వ్యక్తి గుర్తింపునకు ఆధార్ కార్డు కీలకంగా పనిచేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ఆధార్ కార్డు కూడా ఓ నిత్యావసరంగానే మారింది. మనం ఎటువంటి ప్రభుత్వ సేవలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రయివేటు సంస్థలు సైతం వ్యక్తి గుర్తింపు కోసం ప్రూప్ గా ఆధార్ కార్డునే అడుగుతున్నాయి. ప్రజలు కూడా దానికి అలవాటు పడ్డారు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 2009లో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. పుట్టిన పిల్లాడికి కూడా ఆధార్ కార్డును జారీ చేస్తుంది. దీని కోసం వ్యక్తి యొక్క వివరాలతో దరఖాస్తు పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నకిలీ ఆధార్ కార్డులు కూడా కొంతమంది పొందారనే ప్రచారం సాగుతోంది. ఈనేపథ్యంలో నకిలీ కార్డుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని UIDAI నిర్ణయించింది. దీంతో అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది. దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారి ఆధార్ నమోదు ప్రక్రియ 100% పూర్తయిందని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (DoIT) అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా 134 కోట్ల ఆధార్ రిజిస్ట్రేషన్లు జరిగాయని వీరిలో అందరూ వయోజనులేనని DoIT పేర్కొంది.

18 ఏళ్లు పైబడిన వారి ఆధార్ నమోదు పూర్తవ్వడంతో.. 5 సంవత్సరాలకు పైబడిన వారు కొత్తగా ఆధార్ కార్డు పొందేందుకు నిబంధనల్లో మార్పులు చేస్తోంది. గతంలో ఏ ఆధార్ కేంద్రంలో అయినా ఆధార్ కు సంబంధించిన ఎటువంటి సేవలైనా పొందే వీలుండేది. ప్రస్తుతం 5 ఏళ్లు పైబడిన వారు ఆధార్ నమోదు ప్రక్రియను ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే చేసుకునేలా నిబంధనలు మారుస్తోంది. దీంతో అక్టోబర్1 వ తేదీ నుంచి దేశంలో ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే 5 ఏళ్లకు పైబడిన వారు ఆధార్ నమోదు చేసుకోవాలి. అయితే ఆధార్ అప్ డేట్ మాత్రం అన్ని కేంద్రాల్లో చేసుకోవచ్చు. నకిలీ ఆధార్ కార్డుల ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో UIDAI ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Latest Articles
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేయండి.. ఇక ఆ సమస్య అన్న మాటే ఉండదు..
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??