AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్‌ను ఉసిగొల్పుతున్న డ్రాగన్ కంట్రీ

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. చైనా కను సన్నల్లో నేపాల్‌ నడుస్తున్నట్టుగా క్లారిటీ వస్తోంది. ఎన్నడూ లేని విధంగా వరసగా రెండు మూడు రోజులుగా భారత్‌ను టార్గెట్‌గా చేస్తున్న ఆరోపణలపై కేంద్రం ధీటుగా స్పందిస్తోంది. భారత్‌-నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఎలాంటి కృత్రిమ మార్పులను అంగీకరించబోమని భారత్ ప్రకటించింది. భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్‌ను నేపాల్ మంత్రిమండలి ఆమోదించింది. […]

నేపాల్‌ను ఉసిగొల్పుతున్న డ్రాగన్ కంట్రీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2020 | 12:46 PM

Share

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. చైనా కను సన్నల్లో నేపాల్‌ నడుస్తున్నట్టుగా క్లారిటీ వస్తోంది. ఎన్నడూ లేని విధంగా వరసగా రెండు మూడు రోజులుగా భారత్‌ను టార్గెట్‌గా చేస్తున్న ఆరోపణలపై కేంద్రం ధీటుగా స్పందిస్తోంది. భారత్‌-నేపాల్ సరిహద్దులకు సంబంధించి ఎలాంటి కృత్రిమ మార్పులను అంగీకరించబోమని భారత్ ప్రకటించింది. భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్‌ను నేపాల్ మంత్రిమండలి ఆమోదించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.

ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రాంతాల విషయంలో గత పాలకుల మాదిరి తాము వెనుకంజ వేయబోమని, వాటిని దక్కించుకుని తీరతామని ప్రధాని కేపీ శర్మ ఓలి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా తమ దేశంలో కరోనా వ్యాప్తికి భారత్‌ కారణమంటూ మరోసారి వివాదానికి తెరతీశారు.

ఇది చైనా ఆడిస్తున్న నాటకంగానే భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేపాల్ రూపొందించిన మ్యాప్‌కు ఎలాంటి చారిత్రాత్మక ఆధారాలు లేవని, కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను అంగీకరించబోమని భారత విదేశాంగశాఖ తేల్చి చెప్పింది. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే భావనకు విరుద్ధంగా నేపాల్ చర్యలు ఉన్నాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

టిబెట్‌లోని మానస సరోవర్‌ పుణ్యక్షేత్రాన్ని చేరుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం నిర్మించిన లిపులేఖ్ మార్గంపై నేపాల్ విమర్శలు చేయడంతో ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడింది. ముఖ్యంగా ఈనెల 11న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తరాఖండ్‌ మీదుగా లిపులేఖ్‌ వరకూ మానస సరోవర్‌ యాత్రకెళ్లేవారి సౌకర్యార్థం నిర్మించిన రహదారిని ప్రారంభించాక నేపాల్‌లో అసహనం కట్టలు తెంచుకుంది. లిపులేఖ్‌ సమీపంలోనే చైనా సరిహద్దు కూడా వుంటుంది. కనుక కొత్తగా నిర్మించిన ఈ రహదారి వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి కీలకమైనది. అందుకే నేపాల్‌ పేచీ వెనక ‘ఎవరో’ వున్నారని జనరల్‌ నరవానె అన్నారు. ఈ రహదారి వల్ల నేపాల్‌కొచ్చే ఇబ్బంది మాటెలావున్నా యుద్ధ సమయాల్లో మన సైన్యాన్ని సులభంగా తరలించడానికి ఉపయోగపడుతుంది గనుక చైనాకు మాత్రం సమస్యాత్మకమే.