కరోనాపై మరో భయంకర వాస్తవం..గంటకు 4కి. మీ వేగంతో వైరస్ వ్యాప్తి..
ఆరు అడుగుల దూరంతో కరోనా సోకకుండా అడ్డుకోలేమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి, చిన్నగా దగ్గినా.. అత్యంత

కరోనా వ్యాప్తి నివారణకు భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలంటూ పలు దేశాలు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశాయి. భారత్ సహా ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌తో పాటు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. అయితే, మనదేశంలో పాటిస్తున్న కరోనా భౌతిక దూరం ఒక మీటరు, రెండు మీటర్ల దూరాన్ని వైరస్ అవలీలగా దాటేస్తుందని, ఆరు అడుగుల దూరంతో కరోనా సోకకుండా అడ్డుకోలేమని నికోసియా యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
కరోనా వైరస్ కు ఇప్పటి వరకు మందు లేదు. మందు లేకపోవడంతో కేవలం సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్, శానిటైజ్ చేసుకోవడం ఒక్కటే మార్గంగా ఉన్నది. అయితే, బ్రిటన్ కు చెందిన నికోసియా విశ్వవిద్యాలయం భౌతిక దూరంపై కొన్ని పరిశోధనలు చేసింది. ఎంతదూరం పాటు కరోనా గాలిలో ప్రయాణం చేయగలదు అనే దానిపై జరిపిన పరిశోధనల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు అతని నోటి నుంచి వెలువడే తుంపరలో ఉండే కరోనా వైరస్ సాధారణ గాలిలో గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో 18 అడుగుల దూరం వరకు ప్రయాణం చేస్తుందనే నిజాన్ని బయటపెట్టింది. మనం 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తే వచ్చే లాభం ఏం లేదని విశ్వవిద్యాలయం తేల్చి చెప్పింది.
కరోనా వైరస్ సోకిన వ్యక్తి, చిన్నగా దగ్గినా.. అత్యంత తక్కువ స్థాయిలో అంటే గంటకు 4 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నప్పటికీ నోటినుండి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ ఐదు సెకన్లలోనే 18 అడుగులు ప్రయాణిస్తుందని తెలిపారు. దీంతో తక్కువ ఎత్తు ఉండే పెద్దలు, చిన్నారులకు ముప్పు ఉంటుందని అన్నారు. అంటే భౌతిక దూరం పాటించినా కరోనా ముప్పు పొంచి ఉంటుందని తమ పరిశోధనలో తేలిందని వారు వివరించారు.
