AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కొత్త సడలింపులు.. మార్గదర్శకాలు జారీ..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. తాజాగా.. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో.. ఏపీలో పట్టణ, నగర ప్రాంతాల్లో

ఏపీలో కొత్త సడలింపులు.. మార్గదర్శకాలు జారీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 21, 2020 | 11:26 AM

Share

AP Government new guidelines: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. తాజాగా.. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో.. ఏపీలో పట్టణ, నగర ప్రాంతాల్లో దుకాణాలు, సంస్థలు తెరుచుకునేందుకు మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 31 తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూనే, నిబంధనలు పాటిస్తూ దుకాణాలు తెరుచుకునేలా మినహాయింపులు ఇచ్చింది.

వివరాల్లోకెళితే.. జిల్లా యంత్రాంగం కంటైన్మెంట్, బఫర్ జోన్లలో తీవ్రత తగ్గిందని డీ నోటిఫై చేసే వరకు ఆ ప్రాంతాల్లో దుకాణాలు తెరవకూడదని స్పష్టీకరించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చని ఆదేశాల్లో పేర్కొంది. కాలనీలు, రెసిడెన్షియల్ భవనాల్లో ఉన్న దుకాణాలు తీయవచ్చని వెల్లడించింది. అయితే, సినిమా హాళ్లు, మాల్స్, జిమ్ లు, పార్కులు, వినోద ప్రాంతాలకు అనుమతి నిరాకరించింది.

కాగా.. హోటళ్లు, రెస్టారెంట్, ఇతర హాస్పిటలిటీ సేవలకు అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొంది. ప్రేక్షకులు లేకుండా క్రీడా మైదానాలు తెరవొచ్చని సూచించింది. అయితే, వైద్య సిబ్బంది, పోలీసు, అత్యవసర సేవలు, క్వారంటైన్ సేవలు అందిస్తున్న హోటళ్లకు, టేక్ అవే కిచెన్లకు మినహాయింపులు ఇచ్చింది.

హెయిర్ కటింగ్ సెలూన్లలో వినియోగించే పరికరాలు క్రిమిరహితం చేయాలని ఆదేశాలు జారీచేస్తూ.. స్పాలకు, మసాజ్ కేంద్రాలకు అనుమతి లేదని పేర్కొంది. చెప్పులు, వస్త్ర, బంగారు ఆభరణాలు దుకాణాలకు అనుమతి లేదు. భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్లు మాస్కులు వినియోగించాలని దుకాణ యజమానులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ఏపీలో మారిన రూల్స్.. కంటైన్మెంట్ జోన్ల పరిధి కుదింపు..

అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
అపరిచితుడి చాక్లెట్స్ తిన్న స్టూడెంట్స్.. కట్ చేస్తే..
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
ఏమో గుర్రానికి రెక్కలొచ్చే.! ప్రైవేట్ పార్టులో నొప్పితో ఆస్పత్రిక
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో