మెట్రో రైలు సర్వీసులకు కొత్త మార్గదర్శకాలు

ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులకు సంబంధించి ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటెయిన్మెంట్ జోన్లలోని మెట్రో రైల్ నెట్ వర్క్ ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసే ఉంటాయని..

మెట్రో రైలు సర్వీసులకు కొత్త మార్గదర్శకాలు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 02, 2020 | 7:43 PM

ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులకు సంబంధించి ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటెయిన్మెంట్ జోన్లలోని మెట్రో రైల్ నెట్ వర్క్ ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు మూసే ఉంటాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ చీఫ్ మంగు సింగ్ తెలిపారు. వెయిటింగ్ టైం ని 5 నుంచి 7 నిముషాలు పెంచుతున్నామని, ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ ని కలిగి ఉండాలని ఆయన చెప్పారు. మాస్కులు తప్పనిసరి అని పునరుద్ఘాటించారు. ఎలాంటి వైరస్ లక్షణాలు లేని ప్రయాణికులనే అనుమతిస్తామని ఆయన చెప్పారు. ఈ విధమైన గైడ్ లైన్స్ ఆధారంగా హైదరాబాద్ సహా మరో తొమ్మిది నగరాల మెట్రో అధికారులు తమ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని రూపొందించుకున్నారని మంగు సింగ్ వివరించారు.