నేపాల్‌లో టెన్షన్.. టెన్షన్..! సోషల్ మీడియాపై నిషేధం.. కర్ఫ్యూ విధించిన సర్కార్
Gen-z పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నేపాల్ యువత చేపట్టిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. ప్రధాని ఓలి తీరును ఆందోళనకారులు తీవ్రంగా తప్పుపట్టారు. మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్టు సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. ఖాట్మండుతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో..

ఖాట్మాండు, సెప్టెంబర్ 8: నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. నేపాల్ పార్లమెంట్‌లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఖాట్మండులో కర్ఫ్యూ విధించింది. సోషల్ మీడియాపై కూడా బ్యాన్ విధించారు. Gen-z పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అక్కడి యువత చేపట్టింది. ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించారు. ప్రధాని ఓలి తీరును ఆందోళనకారులు తీవ్రంగా తప్పుపట్టారు. మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని జర్నలిస్టు సంఘాలు కూడా ఆందోళన చేపట్టాయి. ఖాట్మండుతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంతాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. ఫేస్‌బుక్ , ఇన్‌స్టా , వాట్సాప్ సహా పలు సమాజిక మాధ్యామాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో నేపాల్ ప్రభుత్వం మొత్తం 26 యాప్స్‌పై బ్యాన్ విధించింది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
GEN-Z పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం నేపాల్ రాజధాని ఖాట్మండులో చలరేగిన ఉద్యమం నేడు తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది యువత ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి నేపాల్ ప్రభుత్వం ఖాట్మండులో కర్ఫ్యూ విధించింది. ప్రస్తుతం ఖాట్మండుతోపాటు విరాట్‌నగర్, భరత్‌పూర్, పోఖ్రా వంటి 10 నగరాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిషేధం మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం వాక్ స్వేచ్ఛను అడ్డుకుంటుందని, వ్యాపారాలకు హాని కలిగిస్తుందని ఆరోపించింది.
కోర్టు ఆదేశం మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కంపెనీలకు ఏడు రోజుల సమయం ఇచ్చామని, అయితే అవన్నీ గడువులో నమోదు చేసుకోవడంలో విఫలమైనట్లు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అందువల్లనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించామని చేయమని ఆ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన నోటీసులో పేర్కొంది. అయితే టిక్‌టాక్‌తో సహా ఐదు కంపెనీలు మాత్రమే ఆ ఆదేశాన్ని పాటించాయి. వాటిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. నేపాల్‌లో పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు విదేశాలలో నివసిస్తున్నాయి. కొందరు పనిచేస్తున్నారు. వారు బంధువులతో కమ్యూనికేషన్ కోసం సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లపై అధికంగా ఆధారపడుతున్నారు. ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




