Viral: ఆడుకుంటూ రూ.10 కాయిన్ మింగిన బాలుడు.. కట్ చేస్తే.. 2 నిమిషాల్లోనే..
మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో 10 ఏళ్ల బాలుడు ఆటకుంటూ పొరపాటున రూ 10 నాణెం మింగేశాడు. నాణెం గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడి డాక్టర్లు మనోజ్ చౌదరి వెంటనే కేసు టేకప్ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో శనివారం పాఠశాలలో ఆడుకుంటూ ఓ 10 ఏళ్ల బాలుడు 10 రూపాయల కాయిన్‌ను మింగేశాడు. అయితే ఓ డాక్టర్ అత్యంత చాకచక్యంగా ఆ కాయిన్ బయటకు తీసి.. పిల్లాడి ప్రాణాలు కాపాడాడు. వివరాల్లోకి వెళ్తే.. పారా గ్రామానికి చెందిన గిర్ధారి పాల్ కుమారుడు నరేంద్ర పాల్ అనే బాలుడు ఆడుకుంటుండగా పొరపాటున కాయిన్ నోట్లో పెట్టుకుని మింగేశాడు. ఆ నాణెం అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడక తల్లిడిల్లిపోయాడు. పరిస్థితి విషమించడంతో.. కుటుంబ సభ్యులు వెంటనే పిల్లోడిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఆసుపత్రికి చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులు.. నాణేలు మింగిన పిల్లల ప్రాణాలను శస్త్రచికిత్స చేయకుండానే కాపాడిన అనుభవం ఉన్న డాక్టర్ మనోజ్ చౌదరి గురించి విన్నారు. వెంటనే ఆయన వద్దకు తీసుకెళ్లగా.. డాక్టర్ సమయాన్ని వృథా చేయకుండా కేవలం రెండు నిమిషాల్లో కాయిన్‌ను సేఫ్‌గా బయటకు తీశారు. దీంతో నిమిషాల్లోనే బాలుడు యథావిధిగా ఊపిరి పీల్చుకుని.. తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాడు. నరేంద్ర ప్రాణం కాపాడినందుకు కుటుంబ సభ్యులు డాక్టర్ మనోజ్ చౌదరికి ధన్యవాదాలు చెప్పారు.
ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని.. డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా నాణేలు, పిన్స్.. ఇతర చిన్న, చిన్న వస్తువులు వారికి అందుబాటులో ఉంచవద్దని సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
