మోకాళ్ల నొప్పితో ఆస్పత్రికి వెళ్ళిన మహిళ.. ఎక్స్-రే చూసి డాక్టర్లు షాక్.. మోకాలిలో బంగారు తీగలు
65ఏళ్ల మహిళ చాలా ఏళ్లుగా ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతోంది. మోకాలి నొప్పుల నుంచి ఉపశమనం కోసం మోకాళ్లలోకి నేరుగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కూడా తీసుకుంది. అయినా నొప్పి తగ్గక పోవడంతో మెడిసిన్ వాడడం మానేసింది. అందుకు బదులుగా ఆక్యుపంక్చర్ తీసుకోవడం మొదలు పెట్టింది. అయినా నొప్పి తగ్గకపోవడంతో మళ్ళీ ఆస్పత్రికి వచ్చింది. మహిళ మోకాలికి ఎక్స్-రే తీసిన డాక్టర్లు ఆ ఎక్స్-రే చూసి తిన్నారు.

రోగి: దక్షిణ కొరియాలో 65 ఏళ్ల మహిళ చాలా సంవత్సరాలుగా మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతుంది. డాక్టర్లు మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారించారు. కీళ్లలోని మృదులాస్థి అరిగిపోవడం వలన మోకాల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. దీంతో ఆమె మొదట్లో నొప్పి నివారణకు నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులతో పాటు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కూడా తీసుకుంది, అయినా నొప్పి తగ్గలేదు సరికదా ఆమెకు మందుల వల్ల కడుపులో నొప్పి మొదలైంది. దీంతో మందులు ఆపేసి.. ప్రత్యామ్నాయ చికిత్సగా ఆక్యుపంక్చర్ చేయించుకోవడం మొదలు పెట్టింది.
తరువాత ఏం జరిగింది:
ఆ మహిళ తన కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి వారానికి ఒకసారి ఆక్యుపంక్చర్ చేయించుకోవడం ప్రారంభించింది . నొప్పి చాలా తీవ్రంగా ఉన్నప్పుడు వారానికి అనేక సార్లు ఆక్యుపంక్చర్ చేయించుకోవడం మొదలు పెట్టింది. అయినా మోకాళ్లు నొప్పి భరించలేనిదిగా మారడంతో మళ్ళీ ఆసుపత్రిలో చేరింది. . వైద్యులు ఆ వృద్ధురాలి ఎడమ మోకాలికి ఎక్స్-రే తీశారు. ఎక్స్-రేలో కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. అందుకంటే మోకాలి చుట్టూ వందలాది చిన్న బంగారు తీగలు కనిపించాయి. ఈ తీగలు అసాధారణమైనవి కావని.. ‘గోల్డ్-థ్రెడ్ ఆక్యుపంక్చర్’ అనే ఒక చికిత్సా పద్ధతిలో భాగమని గుర్తించారు. అంతేకాదు మోకాలి కీలు లోపలి భాగంలోని షిన్‌బోన్ మందంగా గట్టిపడిందని చెప్పారు. మోకాలి కీలు దగ్గర షిన్‌బోన్ , తొడ ఎముక లోపలి భాగాలపై స్పర్స్ అని పిలువబడే ఎముక పెరుగ్తున్నట్లు గుర్తించారు.
గోల్డ్ థ్రెడ్ ఆక్యుపంక్చర్
ఆసియాలో ఆస్టియో ఆర్థరైటిస్ , రుమటాయిడ్ ఆర్థరైటిస్ రెండింటికీ చికిత్స చేయడానికి గోల్డ్-థ్రెడ్ అక్యుపంక్చర్‌ను సాధారణంగా ఉపయోగిస్తారని వైద్యులు చెప్పారు. అయితే, ఈ పద్ధతి పనిచేస్తుందని ఎటువంటి ఆధారాలు లేవు.. కొన్ని సందర్భాల్లో ప్రజలు సకాలంలో చికిత్స పొందకుండా నిరోధించడం ద్వారా పరోక్షంగా ఆర్థరైటిస్‌ను మరింత దిగజార్చుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ బంగారు దారాలు శరీరం లోపలకు వెళ్లి.. శకలాలు పొరుగు కణజాలాన్ని దెబ్బతీస్తాయి. ఈ తీగలు శరీరంలోని ఇతర భాగాలలో చేరుకోవచ్చు.. దీనివల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావచ్చు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




