అమ్మతనాన్ని దూరం చేస్తోన్న నైట్ షిఫ్ట్స్.. సంతానోత్పత్తి కోసం ఈ 5 చిట్కాలు ట్రై చేయండి..
ప్రస్తుతం ఎక్కువమంది దంపతులు సంతానం కోసం సమస్యని ఎదుర్కొంటున్నారు. గర్భం ధరించాలనుకుంటున్నా.. ఆలస్యం అవుతుంది. దీంతో దేవుళ్ళకు మొక్కుతున్నారు. డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అయితే ముందుగా సంతానోత్పత్తి ఆలస్యానికి కారణం మీ జీవనశైలి కారణమా అని అర్థం చేసుకోండి. రాత్రి నిద్ర పోకుండా పనిచేయడం, ఆలస్యంగా నిద్రపోవడం కారణం అని వైద్యులు హెచ్చరితున్నారు. ముఖ్యంగా రాత్రి షిఫ్ట్ చేసే వారిపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఇది మీ సంతానోత్పత్తిని ఎలా బలహీనపరుస్తుందో తెలుసుకోండి.

నేటి జీవనశైలి మీ సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయడం ప్రారంభించింది. గర్భం ధరించడం ఇప్పుడు మునుపటిలా సులభం కాదు. వైద్యుల అభిప్రాయం ప్రకారం సంతానోత్పత్తి తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో ఎక్కువ వయస్సు, హార్మోన్ల అసమతుల్యత, పేలవమైన ఆహారపు అలవాట్లు , ఒత్తిడి వంటి జీవనశైలి అంశాలు ఉన్నాయి. ఈ రోజు మీ సంతానోత్పత్తిని తగ్గించే ఐదు జీవనశైలి కారకాలను గురించి తెలుసుకుందాం..
సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని గైనకాలజిస్ట్ డాక్టర్ సలోని చద్దా.. సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు శరీరంలోని అంతర్గత మార్పులకే పరిమితం కాదని అనేక బాహ్య కారకాలు కూడా ఉన్నాయని చెప్పారు. కలుషితమైన ప్రదేశాలలో నివసించడం, రాత్రి పని చేయడం, తక్కువ నిద్ర మరియు ప్లాస్టిక్ నుంచి విడుదలయ్యే హానికరమైన రసాయనాలు కూడా గర్భధారణ అవకాశాలను తగ్గిస్తాయి. అందువల్ల సంతానోత్పత్తి తగ్గడానికి అసలు కారణం ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం?
రాత్రి షిఫ్ట్‌లలో పని చేయడం, నిద్ర సమయాలు, శారీరక దినచర్యలో ఆటంకాలు మీ సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయని గైనకాలజిస్టులు అంటున్నారు.
నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి
రాత్రి షిఫ్ట్‌లు మీ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. అప్పుడు హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం అవుతాయి. రాత్రి చాలా ఎక్కువ సేపు పనిచేయవద్దు. ఆరోగ్యకరమైన నిద్ర చక్రాన్ని నిర్వహించడానికి మంచి రాత్రి నిద్ర పొవడం ముఖ్యం. బ్లాక్అవుట్ కర్టెన్లు, శబ్దం లేని గదులు వంటి సౌకర్యవంతమైన చీకటి వాతావరణం మంచి నిద్రకు సహాయపడుతుంది.
క్రమం తప్పకుండా దినచర్య
పని , నిద్ర సమయాలను ఒకేలా ఉంచుకోవడం వల్ల శరీరానికి సమతుల్యత లభిస్తుంది. నిరంతరం మారుతున్న షిఫ్ట్‌లు ఋతు చక్రంలో అసమతుల్యతను కలిగిస్తాయి, అండోత్సర్గము నమూనాను ప్రభావితం చేస్తాయి. కనుక పని, విశ్రాంతి సమయాలను సరిగ్గా నిర్వహించండి. విశ్రాంతి సమయంలో పని ఒత్తిడి లేకుండా.. పని సమయాల్లో పనిని పూర్తి చేయండి.
సమతుల్య పోషణ, ఆర్ద్రీకరణ
తాజా కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లు , తృణధాన్యాలు శరీరానికి మేలు చేస్తాయి. కెఫిన్ , ప్యాక్ చేసిన ఆహారాన్ని వీలైంత వరకూ తగ్గించి తినండి. ఇది హార్మోన్ల మార్పులను, గర్భధారణకు మద్దతు ఇచ్చే అంశాలను మెరుగుపరుస్తుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి తగినంత నీరు త్రాగుతూ ఉండండి.
ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించండి
రాత్రి షిఫ్ట్‌లు ఒత్తిడిని పెంచుతాయి. ఇది పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. ధ్యానం, ప్రాణాయామం, యోగా లేదా తేలికపాటి వ్యాయామం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి
మీరు గర్భం ధరించాలని కోరుకున్నా, ఆలస్యం అయితే వెంటనే సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించండి. సంతానోత్పత్తి నిపుణుడు ఖచ్చితమైన కారణాన్ని కనుగొంటారు. సరైన చికిత్సను కూడా సూచిస్తారు.
సంతానోత్పత్తిని ప్రభావితం చేసే నైట్ షిఫ్ట్ లు
రాత్రి పనిచేయడం వల్ల శరీరం సిర్కాడియన్ లయకు అంతరాయం కలుగుతుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను, ఋతు చక్రాలను ప్రభావితం చేస్తుంది. రాత్రి పనిచేసే 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళలకు సంతానోత్పత్తి చికిత్స అవసరమని ఆస్ట్రేలియన్ అధ్యయనం కనుగొంది. రాత్రి పనిచేయడం వల్ల నిద్ర విధానాలలో మార్పులు, హార్మోన్ల అసమతుల్యత గర్భస్రావం, అకాల జనన ప్రమాదాన్ని పెంచుతున్నాయని వెల్లడించింది.
మరిన్నిహెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








