AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటో డ్రైవరన్న ఐడియా అదుర్స్‌..! స్పెషల్‌ ఏంటో మీరే చూడండి..

బెంగళూరులోని ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో గేమింగ్ చైర్‌ను అమర్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఈ ఆవిష్కరణ నెటిజన్లను ఆకట్టుకుంది. ఎర్గోనామిక్ డిజైన్‌తో కూడిన ఈ మార్పు ఆటో డ్రైవర్ల కు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆటో డ్రైవరన్న ఐడియా అదుర్స్‌..! స్పెషల్‌ ఏంటో మీరే చూడండి..
Gaming Chair In Auto
SN Pasha
|

Updated on: Sep 08, 2025 | 2:29 PM

Share

ప్రస్తుత కాలంలో మన దైనందిన జీవితంలో టెక్నాలజీ ఒక భాగమైపోయింది. టెక్నాలజీ లేకుండా మనం శూన్యం అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది తమ తెలివితేటలతో కొత్తగా ఏదైనా చేస్తారు. ఇప్పుడు బెంగళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ ఇలాంటి పని చేసి వార్తల్లో నిలిచాడు . బెంగళూరుకు చెందిన ఒక ఆటో డ్రైవర్ గేమింగ్ చైర్‌ను ఆటో ఫిట్‌ చేశాడు.

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ పోస్ట్‌ @NarasimhaKan అనే ఎక్స్‌ ఖాతా షేర్ అయింది. “ఈ రోజు నాకు ఒక ఎర్గోనామిక్ ఆటో కనిపించింది” అని క్యాప్షన్ ఉంది. ఈ పోస్ట్‌లో ఒక ఆటో డ్రైవర్ తన ఆటోలో గేమింగ్ చైర్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు చూడవచ్చు. సెప్టెంబర్ 4న షేర్ చేయబడిన ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు రెండు లక్షల తొంభై వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి