AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేయడం లేదని తల్లిని చంపిన తనయుడు.. కెనడా నుంచి వచ్చి మరీ..

కెనడాకు తిరిగి వచ్చిన వ్యక్తికి వివాహంపై ఉన్న వ్యామోహం తన తల్లిని హత్య చేయడంతో ముగిసింది. తల్లిదండ్రులు తనకు వధువుని వెదకడంలేదనే కోపంతో, 31 ​​ఏళ్ల వ్యక్తి తన తల్లిని దారుణంగా కొట్టాడు. ఆ మహిళను ఆస్పత్రికి తలించారు. అయితే చేరుకునేలోపే తల్లి మరణించింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.

పెళ్లి చేయడం లేదని తల్లిని చంపిన తనయుడు.. కెనడా నుంచి వచ్చి మరీ..
Man Kills Mom
Surya Kala
|

Updated on: Sep 08, 2025 | 3:22 PM

Share

ఒక యువకుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తనకు పెళ్లి సంబంధాలు చూడమని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే తల్లి తనకు పెళ్లి చేయడంలో ఆలస్యం చేస్తుందనే కోపంతో దారుణంగా కొట్టాడు. చికిత్స నిమిత్తంఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంలోనే తల్లి మరణించింది. ఈ దారుణ ఘటన గుజరాత్ అహ్మదాబాద్‌లోని సత్తాధర్ ప్రాంతంలో ఈ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. నిందితుడు 31 ఏళ్ల బ్రజ్ కాంట్రాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

బ్రజ్ కాంట్రాక్టర్ తనకు వధువుని చూడడం లేదనే కోపంతో తన తల్లి పారుల్‌బెన్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. 55 ఏళ్ల పారుల్‌బెన్‌ ను ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గంలోనే మరణించింది. దీంతో బ్రజ్ చెల్లెలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోలా పోలీసులు అతన్ని హత్య నేరం కింద అరెస్టు చేశారు. సత్తాధర్ క్రాస్‌రోడ్స్ సమీపంలోని వర్ధమాన్‌కృప ఫ్లాట్స్‌లో నివసించే బ్రజ్ 2018లో విద్యార్థి వీసాపై కెనడాకు వెళ్లాడు. అతను చదువు కొనసాగించాడు. ఆరేళ్ళ పాటు కెనడాలో ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చాడు. తన తల్లిదండ్రులు, 25 ఏళ్ల సోదరి సోనాక్షితో కలిసి నివసిస్తున్నాడు. బ్రజ్ తండ్రి గాంధీనగర్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తుండగా సోనాక్షి స్టాక్ బ్రోకరేజ్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో బ్రజ్ హింసాత్మక ప్రవర్తన ఒక అలవాటుగా మారింది. “ఇటీవలి అతను తన తల్లిపై నాలుగైదు సార్లు దాడి చేశాడు. తల్లిని హత్య చేయడానికి రెండు రోజు ముందు తన సోదరితో గొడవపడ్డాడు. కోపంతో చెల్లెలుపై స్టీల్ బాటిల్ విసిరాడు. అయితే ఎప్పుడూ కుటుంబ సభ్యులు బ్రజ్ ప్రవర్తన పై పోలీసులను సంప్రదించలేదు” అని సోలా ఇన్‌స్పెక్టర్ కెఎన్ భుఖాన్ అన్నారు.

మంగళవారం తల్లి కొడుకు మధ్య గొడవ తీవ్రమైంది. తన తల్లిదండ్రులు తనకు పెళ్లికూతురును వెదకమని మరోసారి డిమాండ్ చేశాడు. బ్రజ్ ఆవేశంతో ఊగిపోయాడు. అకస్మాత్తుగా తన తల్లి పారుల్‌బెన్‌పై దాడి చేసి, వీపు, కడుపులో పిడిగుద్దులు గుద్దడం మొదలుపెట్టాడు. కొడుకు దెబ్బలకు పారుల్‌బెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలో అంతర్గత గాయాలు అయ్యి అంతర్గత రక్తస్రావం జరిగింది.

పారుల్‌బెన్‌ను వెంటనే సోలా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. తల్లి మరణం తరువాత సోనక్షి .. తన అన్న బ్రజ్‌పై ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రజ్ హింసాత్మక ధోరణి మానసిక సమస్య వలన వచ్చిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..